భోగభాగ్యాల భోగి

0
113
నగరంలో సంక్రాంతి శోభ
రాజమహేంద్రవరం, జనవరి 14 : ఎటూ చూసినా సంక్రాంతి శోభ ఉట్టిపడుతోంది. దూర ప్రాంతాల నుంచి బంధువుల రాకతో తెలుగు వారి లోగిళ్ళు  సందడిగా మారాయి. తెలుగు వారి పెద్ద పండుగ అయిన సంక్రాంతి తొలిరోజైన నేడు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని నగరంలోని పలు ప్రాంతాల్లో తెల్లవారుజామునే భోగి మంటలు వేశారు. చిన్నా పెద్ద తారతమ్యం లేకుండా భోగి మంటల వద్ద చలి కాగారు.  పలు ప్రాంతాల్లో మహిళలు తమ లోగిళ్ళను అందమైన రంగవల్లులతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. సంక్రాంతి సందర్భంగా వస్త్ర దుకాణాలు, బంగారం దుకాణాలు రద్దీగా మారాయి. స్వీట్‌ స్టాల్స్‌ కూడా రద్దీగా మారాయి. తెలుగు వారి పిండివంటలతో పలు దుకాణాల వారు ప్రజలను ఆకట్టుకునేలా విక్రయాలు చేస్తుండటంతో అక్కడ కూడా విపరీతమైన రద్దీ కనిపిస్తోంది. వాణిజ్య కేంద్రంగా భాసిల్లుతున్న మెయిన్‌రోడ్డు, కందకం రోడ్లు అడుగుతీసి అడుగు పెట్టడానికి వీలు లేనంత రద్దీగా ఉన్నాయి. కొత్త బట్టలు కుట్టే పనిలోదర్జీలు బిజీ బిజీగా ఉన్నారు.  ప్రయాణికులతో రాజమహేంద్రవరం, గోదావరి రైల్వే స్టేషన్లు, ఆర్టీసి కాంప్లెక్స్‌, గోకవరం బస్టాండ్‌, కోటిపల్లి బస్టాండ్‌ రద్దీగా కనిపించాయి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here