మతసామరస్యానికి రాజమహేంద్రవరం ఆదర్శం

0
111

రాజమహేంద్రవరం, జూన్‌ 14 : మత సామరస్యానికి దేశానికే రాజమహేంద్రవరం ఆదర్శమని రూరల్‌ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి, గుడా చైర్మన్‌ గన్ని క ష్ణ అన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఎస్‌.ఎ.గపూర్‌ ఆధ్వర్యంలో మోరంపూడి సెంటర్‌లో ఉన్న గన్నీస్‌ శుభమస్తు ఫంక్షన్‌ హాల్లో ఇఫ్తార్‌ విందు కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా గోరంట్ల, గన్ని, శాప్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రంజాన్‌ పండుగను ముస్లింలు ఎంతో భక్తి శ్రద్దలతో జరుపుకుంటారన్నారు. ముస్లింల సంక్షేమానికి సిఎం చంద్రబాబునాయుడు ఎన్నో పధకాలను అమలు చేస్తున్నారని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని కోరారు. హజ్‌ యాత్ర చేసేందుకు ప్రభుత్వం సబ్సిడీ అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ కుమార్‌, రాచపల్లి ప్రసాద్‌, కురగంటి సతీష్‌, మళ్ళ వెంకట్రాజు, పెండ్యాల రామక ష్ణ, కొత్తూరు బాలనాగేశ్వరరావు, రఫిక్‌ రాజా, మాటూరి రంగారావు, గాదిరెడ్డి బాబులు, శెట్టి జగదీష్‌, తేతలి రాము,ఉప్పలూరి జానకి రామయ్య,మరుకుర్తి రవియాదవ్‌, కవూలూరి వెంకట్రావు, జాలా మదన్‌, వానపల్లి శ్రీనివాసరావు, కంచిపాటి గోవింద్‌, అరిగెల ప్రసాద్‌, బిక్కిన రవి కిషోర్‌, సిటీ కేబుల్‌ చాన్‌ భాషా, ఎస్‌.ఎ.రెహ్మాన్‌, అబ్దుల్‌ ముజీబ్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here