మత్స్య పరిశ్రమ అభివృద్ధికి సహకరించాలి..

0
113
కేంద్ర మంత్రి గిరిరాజ్‌సింగ్‌కి మార్గాని వినతి
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 :  ఉభయ గోదావరి జిల్లాల్లో మత్స్య పరిశ్రమ అభివృద్ధికి మత్స్యకారులకు సహకారం అందించాలని  రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యుడు, వైకాపా పార్లమెంటరీపార్టీ  చీఫ్‌విప్‌ మార్గాని భరత్‌రామ్‌ కోరారు. మత్స్యశాఖ, పశుసంవర్ధక, డైరీ కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ ఢిల్లీలో కలిసి వినతి పత్రం అందచేసారు.  మత్స్య సంపదను విదేశాలకు ఎగుమతి చేసే విధంగా చూడాలని, మేత ధర పెరగడం వలన ఈ రంగం మీద ఆధారపడిన వారికి కష్టంగా మారుతుందని వివరించారు. కొత్త జాతులను అభివృద్ధి చేసి, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి తగిన సబ్సిడీ అందించి, ఫీడింగ్‌ ధరను తగ్గించడంవల్ల ఎగుమతులలో ప్రపంచ దేశాల్లో పోటీపడగలమని, ముఖ్యంగా చైనాను అధిగమించేందుకు అవకాశం కలుగుతుందని చెప్పగా దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here