మధురపూడి విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వండి

0
136
పౌర విమానయాన శాఖ కార్యదర్శికి ఎం.పి. భరత్‌ వినతి
రాజమహేంద్రవరం, నవంబర్‌ 7 :  ప్రయాణికుల రద్దీ పెరగడంతో పాటు రన్‌ వే విస్తరణ పూర్తయినందున రాజమహేంద్రవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని రాజమహేంద్రవరం పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ కోరారు. ఈ మేరకు పౌర విమానయాన శాఖ కార్యదర్శి ప్రదీప్‌సింగ్‌ ఖరోలకు ఆయన వినతని పత్రం అందజేశారు. హైదరాబాద్‌, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు ఇక్కడ నుంచి సర్వీసులు నడుస్తున్నాయని, ఎయిర్‌ కనెక్టివిటీ ద్వారా నిత్యం అనేక మంది విదేశాలకు వెళుతున్నారని, ఈ దృష్ట్యా ఈ విమానాశ్రయానికి అంతర్జాతీయ గుర్తింపు ఇచ్చి మరికొన్ని సర్వీసులను అందుబాటులోకి తేవాలని ఆయన కోరారు. ఇక్కడ నుంచి షిర్డి,తిరుపతి వంటి ఆధ్యాత్మిక నగరాలకు కూడా సర్వీసులు నడపాలని ఎంపి కోరారు. ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు ఈ విమానాశ్రయం ఎంతో ఉపయుక్తంగా ఉన్నందున సర్వీసులు పెంచడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు ఇవ్వాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here