మనసున్న మారాజు జగన్‌  

0
215
పుట్టినరోజు వేడుకల్లో ఎం.పి. భరత్‌
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 21: డాక్టర్‌ వైఎస్సార్‌ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా సెంటర్‌లో ఉన్న వైఎస్‌ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పార్లమెంట్‌ సభ్యులు మార్గాని భరత్‌ రామ్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు.ట్రస్ట్‌ చైర్మన్‌ పడాల పెద్ద వెంకటేశ్వరరావు, వైఎస్‌ చైర్మన్‌ అడపా రాజు సారధ్యంలో జరిగిన ఈ వేడుకల్లో ఏర్పాటు చేసిన 47 కేజిల కేక్‌ను కట్‌ చేశారు. సిఎం అయిన తరువాత మొదటి జన్మదిన వేడుకను వైఎస్సార్‌ సాక్షిగా నిర్వహించడం సంతోషంగా ఉందని, జగన్‌ పుట్టినరోజులు ఇక ముఖ్యమంత్రి హోదాలోనే ఉంటారనని అన్నారు.మాట తప్పని, మడమ తప్పని నాయకుడు జగన్‌ సిఎం అవడం రాష్ట్రానికి అదృష్టమని, ఇచ్చిన హామీల్లో 90 శాతం ఆరు నెలల్లో అమలు చేసి చేతల ప్రభుత్వంగా నిరూపించారని అన్నారు.పాదయాత్రలో వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని, ఆయన మనసున్న మారాజు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైకాపా సిటి కో ఆర్డినేటర్‌ శ్రీఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, జాంపేట బ్యాంకు చైర్మన్‌ బొమ్మన రాజ్‌ కుమార్‌, పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌, మాజీ ఫ్లోర్‌ లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి,వాకచర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్‌, పోలు కిరణ్‌ రెడ్డి, చాంబర్‌ ట్రస్ట్‌ బోర్డు కార్యదర్శి కనకాల రాజా,కాళే చిన్ని మార్గాని సురేష్‌, కొంచా సత్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here