మమ్మల్ని గెలిపించండి….

0
252
బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల ఎస్‌ఎన్‌ఇఏ (ఐ) సంఘం వినతి
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 1 : బిఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగుల హక్కుల సాధనకు ఎస్‌ఎన్‌ఇఏ (ఐ) యూనియన్‌ను గెలిపించాలని ఆ యూనియన్‌ అసిస్టెంట్‌ జనరల్‌ సెక్రటరీ (న్యూఢిల్లీ) పోడూరి పద్మనాభరావు పిలుపు ఇచ్చారు. కుమారి ధియేటర్‌ ఎదురుగా ఉన్న జూపూడి జగన్నాధరావు ప్లాజాలో ఈరోజు ఎస్‌ఎన్‌ఇఏ సర్వసభ్య సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు చిలకపాటి సుబ్బారావు ఆధ్వర్యాన జరిగింది. ఈ సమావేశానికి పద్మనాభరావుతో పాటు జె.ఉమామహేశ్వరరావు, ఏ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల 7న బిఎస్‌ఎన్‌ఎల్‌ ఆఫీసర్ల ఎన్నికలు జరగనున్నాయని, ఆ ఎన్నికల్లో ఎస్‌ఎన్‌ఇఏ ను గెలిపించాలని పిలుపు ఇచ్చారు. దేశ వ్యాప్తంగా మొత్తం 10 యూనియన్లు పోటీలో ఉండగా ఎస్‌ఎన్‌ఇఏకు 9 వ నెంబర్‌ను కేటాయించారని, అధికారులంతా 9 వ నెంబర్‌ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని  కోరారు.  బిఎస్‌ఎన్‌ఎల్‌లో అధికారులు, ఉద్యోగుల  కృషి వల్ల  బిఎస్‌ఎన్‌ఎల్‌ లాభాల బాట పట్టిందన్నారు. ఆఫీసర్లు మరింత కష్టపడి పనిచేస్తే మరింత లాభాన్ని ఆర్జించి వచ్చే ఏడాది జరిగే మూడవ వేతన సవరణలో మంచి ఫలితం సాధించవచ్చని అన్నారు.బిఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండి శ్రీవాత్సవ తీసుకున్న నిర్ణయాల ఫలితంగా నష్టాలను అధిగమించి మంచి లాభాలను ఆర్జించిందన్నారు. రెండవ వేతన సవరణ సమయంలో బిఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు మంచి వేతనాలు రాబట్టడంలో, అధికారులకు పదోన్నతులు కల్పించడంలో ఎస్‌ఎన్‌ఇఏ విశేషమైన కృషి చేసిందన్నారు. ఈ ఎన్నికల్లో తమ యూనియన్‌ను గెలిపిస్తే డైరక్ట్‌ రిక్రూట్డ్‌ అధికారులకు 30 శాతం ఫిట్‌మెంట్‌ (రిటెర్మెంట్‌ బెనిఫిట్‌ను) సాధించడం, ఇ 2,  ఇ3 స్టాండర్డ్‌ పే స్కేలు సాధిస్తామన్నారు. సర్వీస్‌ ఆధారిత పదోన్నతులకు కృషి చేస్తామన్నారు. ఈ సమావేశంలో యూనియన్‌ జిల్లా కార్యదర్శి చిక్కాల వెంకట్రావ్‌, చిలకపాటి సుబ్బారావు, నీలం శ్రీనివాస్‌, చల్లా శివభాస్కర్‌, కవి మురళీకృష్ణ, ఏవి అవధాని, కె. రవికిషోర్‌, పి.పల్లంరాజు, పాటూరి అప్పారావు,  బి.ఉదయ్‌కుమార్‌, టివి ప్రకాష్‌ కుమార్‌, పి. జోజి కుమార్‌, కె మోజస్‌కుమార్‌. సురేష్‌, కె.నాగరాజు, ఎస్‌.రాధాకృష్ణ, ఎస్‌.వీరన్న, ఎన్‌ సత్యశ్రీనివాస్‌, జీవి రమణ, టి.ధర్మారావు, సాయిబాబా పాల్గొన్నారు.