మరిన్ని కార్పొరేట్‌ సంస్థలు రావాలి

0
141
పీటర్‌ ఇంగ్లాండ్‌ షోరూమ్‌ను ప్రారంభించిన శివరామ సుబ్రహ్మణ్యం
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : వాణిజ్య రాజధానిగా పిలువబడే రాజమహేంద్రవరానికి మరిన్ని కార్పొరేట్‌ సంస్థలు రావాలని ఏపిఐఐసి మాజీ ఛైర్మన్‌, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటి కో ఆర్డినేటర్‌ శ్రీఘాకొళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం అన్నారు. కఠారినగర్‌ రామాలయం సమీపంలో నూతనంగా ఏర్పాటు చేసిన పీటర్‌ ఇంగ్లాండ్‌ షోరూమ్‌ను ఆయన ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలనతో పాటు తొలి కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా శివరామ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ బలభద్ర రూపేష్‌ కుమార్‌ సారధ్యంలో పీటర్‌ ఇంగ్లాండ్‌ షోరూమ్‌ నెలకొల్పడం సంతోషంగా ఉందని, దీంతో మరెన్నో షోరూమ్‌ లు నెలకొల్పి వందలాది మందికి ఉపాధి కల్పిస్తున్నారని అన్నారు. రాజమహేంద్రవరంలో ఇప్పటికే చాలా షోరూమ్‌ లు వచ్చాయని, భవిష్యత్తులో మరిన్ని రావాలని ఆయన ఆకాంక్షించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here