మలబార్‌ దీపావళి సంబరాల ప్రత్యేక ఆఫర్‌లు

0
148
రాజమహేంద్రవరం, నవంబర్‌ 3 : ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల రిటైల్‌ దుకాణాల్లో ఒకటైన మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ ఈ దీపావళి పండుగ సందర్భంగా తమ ప్రత్యేక క్యాంపెయిన్‌ ప్రారంభించింది. ఈ దీపావళిని ఉచిత బంగారు నాణాలతో జరుపుకోండి అన్నది ముఖ్య సందేశం. 25 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్బంగా మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైౖమండ్స్‌ వినియోగదారులందరికీ తమ కొనుగోళ్లపై 250 కిలోల వరకు బంగారాన్ని గెలుచుకొనే అవకాశం కల్పిస్తుంది. ఆఫర్లో భాగంగా ప్రతీ రూ.10000ల బంగారం కొనుగోలుపై 1 బంగారు నాణం ఉచితం అలాగే ప్రతీ రూ.10000ల వజ్రాల కొనుగోలుపై 2 బంగారు నాణాలు ఉచితం, ఈ ఆఫర్‌ కేవలం నవంబర్‌ 25, 2018 వరకు అమలులో ఉంటుంది. నవంబర్‌ 4, 2018 కి ముందుగా బుక్‌ చేసుకొని అదనంగా వెండి ఉచితంగా పొందవచ్చును. ఈ క్యాంపెయిన్‌ లో భాగంగా సరికొత్త బంగారం, వజ్రాభరణాల డిజైన్లను ప్రదర్శిస్తున్నారు. ఈ ఆభరణాలు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైౖమండ్స్‌ వారి బ్రాండ్లు సమాహారం మైన్‌ – వజ్రాభరణాలు, ఎరా – అన్‌ కట్‌ వజ్రాభరణాలు, ప్రీషియా – విలువైన రత్నాభరణాలు, డివైన్‌ – భారతీయ వారసత్వ ఆభరణాలు, ఎత్నిక్స్‌ – హ్యాండ్‌ క్రాప్టెడ్‌ డిజైనర్‌ ఆభరణాలు, స్టార్లెట్‌ – పిల్లల ఆభరణాలు మరియు హయ్‌ – క్యాజువల్‌ ఆభరణాలు ప్రదరిస్తున్నారు. ఈ ఆభరణాలకు అతితక్కువ మజూరి కేవలం 12% నుండి అందించడం జరుగుతుంది. ఈ ఆభరణాలకు సంబందించిన ప్రత్యేక బ్రోచర్‌ను కూడా వినియోగదారులకు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. ఈ అన్ని ఆభరణాలు మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైౖమండ్స్‌ వారి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ షోరూమ్లో అందుబాటులో ఉంటాయని అని మలబార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ రీజనల్‌ హెడ్‌ ఆంధ్ర ప్రదేశ్‌,తెలంగాణ సిరాజ్‌ పికె తెలిపారు. సామాజిక సంస్థాగత భాద్యత రూపంలో ఆరోగ్యం, ఉచిత విద్య, నిరుపేదలకు గ హ నిర్మాణం, మహిళా సాధికారిత ఇంకా పర్యావరణ రక్షణ కార్యక్రమాల కొరకు తమ వార్షిక ఆదాయంలో 5 శాతాన్ని కేటాయిస్తుందని తెలియజేశారు. మలబార్‌ బార్‌ గోల్డ్‌ అండ్‌ డైమండ్స్‌ 25 వసంతాలు పూర్తిచేసుకున్నసందర్భంగా తమ ఖాతాదారులతో కలిసి సంబరాలు నిర్వహించింది. ఖాతాదారుల మధ్యకేక్‌ను కట్‌చేసి ఆనందం పంచుకున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here