మల్టీ ఫ్లెక్స్‌ నిర్మాణ వ్యవహారంపై విచారణ జరపాలి 

0
411
మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు డిమాండ్‌
రాజమహేంద్రవరం, నవంబర్‌ 27 : అధికార పార్టీ నాయకుల అండదండలు ఉంటే చట్టాలను, నిబంధనలను తుంగలోకి తొక్కేయడానికి ఏ మాత్రం వెనుకాడరని చెప్పడానికి ఆనాల వెంకట అప్పారావు రోడ్డులో అక్రమంగా జరుగుతున్న మల్టీ కాంప్లెక్స్‌ నిర్మాణమే నిదర్శనమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ సిటి కో ఆర్డినేటర్‌ రౌతు సూర్యప్రకాశరావు అన్నారు. అక్రమ నిర్మాణంపై జిల్లా కలెక్టర్‌ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ప్రెస్‌క్లబ్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికార పార్టీ నాయకుల అశ్రిత పక్షపాతం, బంధుప్రీతి కారణంగా గత ఎనిమిది నెలలుగా అక్రమ నిర్మాణం జరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని, తద్వారా అపార్ట్‌మెంట్‌ కూలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. దీనిపై టౌన్‌ ప్లానింగ్‌కు సంబంధం లేదని సిటి ప్లానర్‌ చెబుతుండగా, గుడా నుంచి అనుమతులు పొందలేదని చైర్మన్‌ గన్ని క ష్ణ పేర్కొన్నారని అన్నారు. ఒక నేత అండతో ఇష్టారాజ్యంగా తవ్వకాలు జరిపారని చెప్పారు. భారీ గోతులు కారణంగా అపార్ట్‌మెంట్‌ గోడ కూలిపోగా ఎంపి అనుచరులు వచ్చి నివాసితులను హోటళ్లకు తరలించారని అన్నారు. చిన్న చిన్న ఆక్రమణలపై ప్రతాపం చూపించే అధికార యంత్రాంగం  ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణం జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. తక్షణమే అపార్ట్‌మెంట్‌కు నష్టం వాటిల్లకుండా మట్టిని పూడ్చాలని డిమాండ్‌ చేశారు.
ప్రభుత్వ స్ధలాలు కార్పొరెట్‌ సంస్ధలకు ధారాదత్తం
సెంట్రల్‌ జైలును ఇక్కడి నుంచి తరలించి క్రీడా స్టేడియం, పేదలకు గ హాలు నిర్మించాలని తాము గతంలో ఆలోచనలు  చేసామని, అయితే ప్రస్తుత ప్రభుత్వం జైలుశాఖ స్థలంలో మంజీర కనస్ట్రక్షన్స్‌ సంస్థతో పబ్లిక్‌, ప్రయివేట్‌ భాగస్వామ్యంతో రూ.100 కోట్లతో కన్వెన్షన్‌ హాల్‌ నిర్మిస్తున్నారని, ప్రభుత్వ స్థలాలను కార్పొరేట్‌ సంస్థలకు ధారాదత్తం చేయడాన్ని అడ్డుకుంటామన్నారు.దీనిపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తామని అన్నారు.ఇలాంటి ఒప్పందాలపై  తాము అధికారంలోకి వచ్చాక విచారణ జరిపిస్తామన్నారు.పార్టీ నగర అధ్యక్షులు నందెపు శ్రీనివాస్‌ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఇప్పుడు జగన్‌ను టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేస్తున్నారని, గత ఎన్నికల్లో చంద్రబాబుకు  పవన్‌ కల్యాణ్‌ మద్దతు ఇవ్వడం వల్లే రాష్ట్రం అవినీతిమయంగా మారిందన్నారు.  అందుకు రాష్ట్రంలో పర్యటించే ముందు ప్రజలకు పవన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.విలేకరుల సమావేశంలో మాజీ ఫ్లోర్‌ లీడర్‌ పోలు విజయలక్ష్మి, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు  మార్తి లక్ష్మి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి పిల్లి సిరి బాల, కార్పొరేటర్లు ఈతకోట బాపన సుధారాణి, మజ్జి నూకరత్నం, పిల్లి నిర్మల, బొంతా శ్రీహరి,కురుమిల్లి అనురాధ,నాయకులు గుర్రం గౌతమ్‌, భీమవరపు వెంకటేశ్వరరావు,  కాటం రజనీకాంత్‌, మజ్జి అప్పారావు, నీలం గణపతి రావు, బాషా,కుక్కా తాతబ్బాయి పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here