మళ్ళీ వరద పోటు

0
82
ధవళేశ్వరం వద్ద 2వ ప్రమాద హెచ్చరిక జారీ – 13.75 అడుగులకు చేరిన నీటిమట్టం
రాజమహేంద్రవరం, ఆగస్టు 8 : గోదావరికి మళ్ళీ వరద ఉధృతి పెరిగింది. నిన్న ఉదయం ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించిన అధికారులు ఈరోజు ఉదయం 13.75 అడుగులకు నీటిమట్టం పెరగడంతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 13 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని సముద్రంలోకి విడిచిపెడుతున్నారు. వరద పోటు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకున్న తరుణంలో మళ్ళీ వరద ఉధృతి పెరగడంతో  భయాందోళన మొదలైంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here