మహనీయులు వారు…..మరువలేము ఎన్నడూ…

0
384
గాంధీ, లాల్‌బహుదుర్‌ శాస్త్రిలకు గన్ని కృష్ణ నివాళి
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 2: శాంతి మంత్రాన్ని ఉపయోగించి దేశానికి స్వాతంత్య్రం సాధించిన మహనీయుడు గాంధీ మహాత్ముడైతే, జై జవాన్‌…జై కిసాన్‌ నినాదంతో దేశ గౌరవాన్ని ఇనుమడింపజేసి యుద్ధ సమయంలో శత్రు దేశాలకు వణుకు పుట్టించిన ఉక్కు మనిషి లాల్‌బహుదుర్‌శాస్త్రి అని, వీరు చూపిన బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ పిిలుపు ఇచ్చారు. జాతిపిత మహత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌బహుదుర్‌ శాస్త్రిల జయంతి సందర్భంగా గన్ని కృష్ణ కార్యాలయంలో వారికి నివాళులర్పించారు. ముందుగా వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ ఇద్దరు మహనీయుల జయంతి ఒకేరోజు కావడం సంతోషకరమని, ప్రస్తుత పరిస్థితుల్లో శత్రు దేశం మన దేశంలో పాగా వేయడానికి పొంచి  ఉన్న తరుణంలో అందరూ ఏకమై భారతదేశ సైనికులకు నైతిక మద్దతు తెలపాలన్నారు. పాకిస్తాన్‌ ఉగ్ర వాదుల దాడిలో మృతి చెందిన వీర జవాన్ల స్మృతికి రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో టిడిపి ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు మాటూరి రంగారావు, యిన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, మర్రి దుర్గాశ్రీనివాస్‌, పార్టీ నాయకులు మళ్ళ వెంకట్రాజు, ఉప్పులూరి జానకిరామయ్య, గొర్రెల రమణ, సెనివాడ అర్జున్‌, కవులూరి వెంకట్రావ్‌, కోట కామరాజు, ఎం.డి.మున్నా, కెవిడి  భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు.