మహాలక్ష్మి మార్కెట్‌ వద్ద ఆటోస్టాండ్‌ ప్రారంభం

0
177
రాజమహేంద్రవరం, జులై 1 : రాజమహేంద్రవరం రూరల్‌ మోరంపూడి సమీపంలో ఉన్న మహాలక్ష్మి మార్కెట్‌ వద్ద వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ట్రేడ్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటైన శ్రీ విజయదుర్గ మిని గూడ్స్‌ ఓనర్స్‌ అండ్‌ వర్కర్స్‌ యూనియన్‌ను ఆ పార్టీ సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి ప్రారంభించారు. దాదాపు యాభై మంది సభ్యులు కలిగిన ఈ స్టాండ్‌ ప్రారంభోత్సవం వైఎస్సార్‌ ట్రేడ్‌ యూనియన్‌ నాయకులు నరవ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో రూరల్‌ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ ఆకుల వీర్రాజు, అడపా వెంకటరమణ, బొంతా శ్రీహరి, సప్పా ఆదినారాయణ, కసిరెడ్డి కామేశ్వరరావు, ధర్మవరపు శ్రీనివాసరావు, మేడి త్రిమూర్తులు, పోలవరపు రాజు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here