మహిళలకు ఏదీ రక్షణ ? 

0
163
‘దిశ’ హత్యాచారంపై నినదించిన విద్యార్థి లోకం
ఎం.పి.భరత్‌ ఆధ్వర్యాన నగరంలో భారీ ర్యాలీ
రాజమహేంద్రవరం,డిసెంబర్‌ 2 : మహిళల భద్రత అంశాన్ని పార్లమెంటులో ప్రస్తావిస్తానని రాజమహేంద్రవరం పార్లమెంటు నియోజకవర్గ ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. ఎంపీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘దిశ’  హత్యా సంఘటనను నిరసిస్తూ నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల వద్ద ఈ నిరసన ర్యాలీని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ ప్రారంభించారు. విద్యార్థినీ, విద్యార్థులతో కలిసి ఆయన ర్యాలీలో పాల్గొన్నారు. ఆర్ట్స్‌ కళాశాల నుంచి వై-జంక్షన్‌, కంబాలచెరువు, దేవీచౌక్‌ మీదుగా అంబేద్కర్‌ సెంటర్‌కు ర్యాలీ సాగింది. అంబేద్కర్‌ సెంటర్‌లో డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి ఎంపీ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పుష్కర ఘాట్‌ వరకూ ర్యాలీ సాగింది. ఈ ర్యాలీ అద్యంతం విద్యార్థినీ, విద్యార్థులు దిశ హత్యోదంతాన్ని నిరసిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని, మాకు న్యాయం కావాలి అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పుష్కర ఘాట్‌ వద్ద విద్యార్థినీ, విద్యార్థులతో ప్రత్యేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎంపీ మారాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ దిశ హత్యోదంతం దారుణమని, ఇటువంటి సంఘటనలు జరగడం సమాజానికి మంచిది కాదన్నారు. ఇటువంటి దురాగతాలకు పాల్పడకుండా ప్రతీ ఒక్క పౌరుడు బాధ్యతతో మసులుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నిర్భయ వంటి చట్టాలు ఉన్నా ఇటువంటి అఘాయిత్యాలు జరగడం మంచిది కాదన్నారు. పార్లమెంటు వేదికగా దిశ హత్యోదంతం అంశాన్ని లేవనెత్తుతానని, దేశవ్యాప్తంగా ఈ అంశంపై చర్చించేందుకు వీలుగా పార్లమెంటులో చర్చకు పట్టుబడతామని అన్నారు. ప్రత్యేక చట్టాల కోసం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు అంతా కలిసి న్యాయశాఖా మంత్రిని కలిసి వినతిపత్రాన్ని అందిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు,  వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్‌, మేడపాటి షర్మిలారెడ్డి, నక్కా శ్రీనగేష్‌, గిరిజాల బాబు, గుర్రం గౌతమ్‌, దాసి వెంకట్రావు, అజ్జరపువాసు, మార్గాని చంటిబాబు, మజ్జి అప్పారావు, ఆరిఫ్‌, పోలు విజయలక్ష్మి, మజ్జి నూకరత్నం, మార్తి లక్ష్మి, సంకిస భవానీ ప్రియ, గారా చంటిబాబు, నిరీక్షణ జేమ్స్‌, చవ్వాకుల సుబ్రహ్మణ్యం, సయ్యద్‌ హసీనా, నందం స్వామి, మీసాల గోవిందరావు, దూనబోయిన హరికృష్ణ, తిరగటి దుర్గ, గుడాల ఆదిలక్ష్మీ, కుంచా సత్య,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here