మహిళలపై అఘాయిత్యాలు నశించాలి

0
209
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 :  మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యలను నిరసిస్తూ రాజమహేంద్రి మహిళా జూనియర్‌, డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థినులు భారీ ప్రదర్శన నిర్వహించారు. మంగళవారం స్థానిక కళాశాల వద్ద నుంచి దేవీచౌక్‌ మీదుగా గోకవరం బస్టాండ్‌ వరకు ర్యాలీగా వచ్చి అక్కడ మానవహారం నిర్వహించారు. అత్యాచారాలను నిరసిస్తూ పలువురు విద్యార్ధినులు అందరికీ అవగాహన కలిగేలా పలు రకాల స్కిట్లు ప్రదర్శించారు. ప్లకార్డులు చేతబూని, నల్లరిబ్బన్లు ధరించి విద్యార్థినులు నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. జస్టిస్‌ ఫర్‌ దిశ, మహిళలపై వేధింపు అరికట్టాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈసందర్భంగా కళాశాల కరస్పాండెంట్‌/సెక్రటరీ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎన్ని చట్టాలు అమల్లోకి వచ్చినా మహిళలపై అత్యాచారాలు, హత్యలు ఆగకపోవడం దారుణమన్నారు. సమాజంలో మార్పు ముందు ప్రతీ ఇంటి నుంచి మొదలు కావలన్నారు. ప్రతీ ఒక్క మహిళను తోబుట్టువుగా భావించినప్పుడే ఈ మార్పు సాధ్యం అవుతుందన్నారు. జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యకేసులో నిందితులకు విధించే శిక్ష సమాజంలో నేరాలు చేయాలనుకునే వారికి గుణపాఠం కలిగేలా ఉండాలని కోరారు. ప్రిన్సిపాల్‌ టి.సత్యసౌందర్య మాట్లాడుతూ జస్టిస్‌ ఫర్‌ దిశ హత్యకేసు నిందితులకు కఠిన శిక్షలు పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు తేవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎస్‌ఎస్‌ పిఓ లక్ష్మి ప్రవీణ, ఎంకెఎస్‌ ప్రసాద్‌, కళాశాల అధ్యాపకులు రజనీ, స్వాతి, కామేశ్వరి, శ్రీదేవి, గౌరికుమార్‌, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here