మహిళల ఆర్ధిక స్వావలంబన కోసమే కుట్టు శిక్షణ కేంద్రాలు

0
272
ట్రైనింగ్‌ కళాశాలలో ప్రారంభించిన గన్ని, ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 19 : మహిళల ఆర్ధిక స్వావలంబన కోసమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మెప్మా ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారని,ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. స్థానిక 25 వ డివిజన్‌లో  బిసి,కాపు మహిళల కోసం ప్రభుత్వ ట్రైనింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండు కుట్టు శిక్షణ కేంద్రాలను గన్ని, ఆదిరెడ్డి ప్రారంభించారు. అనంతరం కార్పొరేటర్‌ కురగంటి ఈశ్వరి సతీష్‌ అధ్యక్షతన జరిగిన సభలో గన్ని మాట్లాడుతూ మహిళల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు మెప్మా ద్వారా కుట్టు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేసి శిక్షణ పొందిన వారికి ఉపకార వేతనంతో పాటు మిషన్లు అందిస్తున్నారని అన్నారు. చాలా మంది రాజకీయ నాయకులు ఎన్నికల సమయంలో డబ్బులిచ్చి ఓట్లు కొనుగోలు చేసి అధికారంలోకి రావడానికి ప్రయత్నిస్తారని, చంద్రబాబు అయితే తనపై నమ్మకం ఉంచిన వమ్ము చేయకుండా అందరిని ఆర్ధికంగా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు. రాష్ట్రం కోసం, ప్రజల కోసం పనిచేసే చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచి రానున్న ఎన్నికల్లో భారీ విజయాన్ని ఆయనకు బహుమతిగా అందించాలని కోరారు.నాడు తెదేపా వ్యవస్థాపకులు ఎన్టీఆర్‌ ఆస్తిలో మహిళలకు సమాన హక్కు కల్పించారని,అదే బాటలో చంద్రబాబు పరిపాలిస్తూ పెద్ద అన్నగా ఆడపడుచులకు పసుపు-కుంకుమ ద్వారా కానుకను అందించారని అన్నారు.ఆదిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో ఇచ్చిన హామీలను, ప్రకటించని వాటిని కూడా అమలు చేసి అన్ని వర్గాల సంతోషం కోరుతున్నారని అన్నారు. పసుపు-కుంకుమ, వృద్ధులకు,వివిధ వర్గాలకు ఫించన్లు, రైతుల కోసం అన్నదాత సుఖీభవ  పధకాలను ప్రవేశపెట్టి భరోసా కల్పించారని అన్నారు. బిసి కార్పొరేషన్‌ ద్వారా ఒకటి,కాపు కార్పొరేషన్‌ ద్వారా మరొకటి కుట్టు శిక్షణ కేంద్రాలు మంజూరు అయ్యాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కురగంటి సతీష్‌,విశ్రాంత ప్రధానోపాధ్యాయులు ఆర్‌.నాగేశ్వరరావు, నల్లం ఆనంద్‌, గుణపర్తి సాంబశివరావు, కిషోర్‌,ఎపిపిసి ప్రతినిధి ముత్యాలరావు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here