మహిళా కండక్టర్‌ హఠాన్మరణం

0
140
రావులపాలెం, అక్టోబర్‌ 10 : రావులపాలెం బస్‌ డిపోలో కండక్టర్‌ గా పనిచేస్తున్న కొంగరాపు కృష్ణవేణి (44) హఠాన్మరణం చెందారు. బుధవారం రాత్రి ఆఖరి ట్రిప్‌ ముగించుకొని, 11 గంటల సమయంలో క్యాష్‌ కౌంటర్లో కలెక్షన్‌ డిపాజిట్‌ చేస్తుండగా ఆయాసం రావడంతో కుప్ప కూలింది. తోటి కండక్టర్‌ లు 108 కు సమాచారం అందించగా 108 సిబ్బంది చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించి అప్పటికే మృతి చెందినట్లు వెల్లడించారు. తీవ్ర గుండెపోటు రావడంతో కృష్ణవేణి మృతి చెందారు. రాజమహేంద్రవరం, 3వ డివిజన్‌,  సుబ్బారావు పేటకు చెందిన కృష్ణవేణికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గురువారం ఉందయం ఆర్టీసి కార్మిక సంఘం నాయకులు సుబ్బారావు పేటలోని వారి స్వగృహానికి విచ్చేసి, కృష్ణవేణిి పార్ధీవదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసారు. కోటిలింగాలపేట కైలాస భూమిలో గురువారం అంత్యక్రియలు జరిగాయి. డిపో మేనేజర్‌ అజిత కుమారి, సిఐ అచ్యుతాంబ, యూనియన్‌ నాయకులు కొండలరావు, రాజు, యోసేపు తదితరులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here