మహిళా శక్తే తెలుగుదేశం పార్టీకి మూలం

0
188
రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 25 :  తెలుగుదేశం పార్టీకి ఆది నుంచి మహిళా శక్తి అండగా ఉందని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు అన్నారు. అర్పిలు, మహిళ సంఘాల మహిళలతో మెయిన్‌ రోడ్డులోని జగదీశ్వరి హోటల్లో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళ సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారన్నారు. వాటిలో భాగంగానే పసుపు కుంకుమ పథకంలో భాగంగా డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళకు 10 వేల రూపాయలు అందించారని తెలిపారు. మహిళల సంక్షేమం కోసం అహర్నిశలు క షి చేస్తున్న చంద్రబాబుకు మహిళలు మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే మహిళలు అన్ని రంగాల్లో అభివ ద్ధి చెందుతారని అన్నారు. మహిళ సంఘాలు అభివ ద్ధి చెందలన్నా, ఆర్ధికంగా ఎదగాలన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండాలన్నారు. మహిళలు మద్దతు ఇచ్చి చంద్రబాబును మరోసారి ముఖ్యమంత్రిని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి రాంబాబు, రెడ్డి రాజు, మినిమం వేజెస్‌ కమిటీ డైరెక్టర్‌ నక్కా చిట్టిబాబు, ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశీ నవీన్‌, కూర గంటి సతీష్‌, కార్పొరేటర్‌ కడలి రామక ష్ణ, కూర గంటి ఈశ్వరి, బెజవాడ రాజ్‌ కుమార్‌, కోసూరి చండీప్రియ, పితాని లక్ష్మి, ఇన్నమూరి రాంబాబు, కొమ్మ శ్రీను, మజ్జి పద్మ, మాజీ కార్పొరేటర్‌ బొమ్మన మైన శ్రీనివాస్‌, నాయకులు రుంకాని వెంకటేశ్వరరావు, వాసిరెడ్డి బాబీ, సాయి, పితాని కుటుంబరావు, కడితి జోగారావు, ఈతలపాటి క ష్ణ, జక్కంపూడి అర్జున్‌, కర్రీ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here