మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి కన్నుమూత

0
221

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 25 : తెలుగుదేశం పార్టీ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానందరెడ్డి ఈ ఉదయం హైదరాబాద్‌లో కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. రాష్ట్ర రాజకీయాల్లో ఆనం సోదరులుగా గుర్తింపు పొంది వారిలో ఒకరైన వివేకానందరెడ్డి నెల్లూరు జిల్లాకు చెందిన వారు. ఆ జిల్లా నుంచే వివేకానందరెడ్డి 1999, 2004,2009 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న వివేకానందరెడ్డి హైదరాబాద్‌ కిమ్స్‌ హాస్పటల్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. తనదైన శైలిలో, హవభావాలతో ప్రజలను ఆకట్టుకునే వివేకానందరెడ్డి తన కంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఆయనకు ఇద్దరు కుమారులు. భౌతికకాయాన్ని స్వస్ధలం నెల్లూరుకు తరలించారు. వివేకానందరెడ్డి మృతి పట్ల సీఎం చంద్రబాబు, పలువురు మంత్రులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here