మాజీ ఎమ్మెల్యే తటవర్తి సత్యవతి కన్నుమూత

0
282

రాజమహేంద్రవరం, మార్చి 3 : మాజీ ఎమ్మెల్యే తటవర్తి సత్యవతి ఈరోజు తెల్లవారుఝామున 3గంటల ప్రాంతంలో కన్నుమూశారు. ఆమె వయస్సు 74 సంవత్సరాలు. ఆమెకు భర్త హ్రనుమంతరావు, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె వున్నారు. 1978లో ఇందిరా కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అనూహ్య విజయం అందుకున్న ఆమె పార్లమెంటరీ సెక్రటరీగా సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వహించారు. రాజమండ్రి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు స ష్టించారు. ఆనాడు కాంగ్రెస్‌ పార్టీలో వచ్చిన చీలిక, హేమాహేమీలంతా రెడ్డి కాంగ్రెస్‌లోకి వెళ్లిపోవడంతో, ఇందిరా కాంగ్రెస్‌ తరపున రాజమండ్రి టికెట్‌ ఇవ్వడానికి అధిష్టానం ముందుకొచ్చినా, ఎవరూ లేకపోవడంతో రాజకీయాలకు పూర్తిగా కొత్తయిన తటవర్తి సత్యవతికి టికెట్‌ ఇవ్వడం, ఆమె కూడా చొరవగా ముందుకొచ్చి పోటీ చేయడంతో విజయాన్ని సొంతం చేసుకున్నారు. పలు అభివ ద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఆతర్వాత రాజకీయాల్లో కొనసాగినా, గత కొన్నేళ్లుగా పూర్తిగా రాజకీయాలకు దూరంగా వుంటున్నారు. పిఠాపురం ఉమర్‌ ఆలీషా పీఠం భక్తురాలిగా చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సత్యవతి మరణవార్త తెలియగానే గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, ఎపిఐఐసి మాజీ చైర్మన్‌ శ్రిఘాకోళ్ళపు శివరామ సుబ్రహ్మణ్యం, నగర కాంగ్రెస్‌ అధ్యక్షులు ఎన్‌.వి.శ్రీనివాస్‌, మాజీ కార్పొరేటర్‌ వాకచర్ల కృష్ణ, కో-ఆప్షన్‌ సభ్యులు చాన్‌ భాషా, బీసీ సంఘం నాయకురాలు కెహారిక, లక్కోజు వీరభద్రరావు, అసదుల్లా అహ్మద్‌, ఎస్‌.ఎ.కె.అర్షద్‌, క్షత్రియ బాలసుబ్రహ్మణ్యసింగ్‌, తదితరులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here