మాజీ కార్పొరేటర్‌ ఏవీ రమణకు మాతృ వియోగం

0
385

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 5 : క్యాటరింగ్‌ రంగంలో పేరెన్నికగన్న అయ్యలసోమయాజుల సుందరం సతీమణి, మాజీ కార్పొరేటర్‌ ఏవీ రమణ మాతృమూర్తి సూర్యుడు ఈ ఉదయం కన్నుమూశారు. ఆమె వయస్సు 80 సంవత్సరాలు. ఆమెకు నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వయోభారంతో బాధపడుతున్న ఆమె ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఆమె భౌతికకాయానికి ఈ మధ్యాహ్నం ఇన్నీస్‌పేట రోటరీ కైలాస భూమిలో అంత్యక్రియలు జరిగాయి. ఆమె మరణ వార్త తెలియగానే మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌, కార్పొరేటర్‌ ద్వారా పార్వతి సుందరి, మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, మానే దొరబాబు, గొర్రెల సత్యరమణి, అజ్జరపు వాసు, కో ఆప్షన్‌ సభ్యురాలు కప్పల వెలుగు, మాజీ కౌన్సిలర్‌ పిల్లి సుబ్రమణ్యం,గంగరాజు డెయిరీ అధినేత నిమ్మలపూడి గోవింద్‌, మాజీ సర్పంచ్‌ మెట్ల ఏసుపాదం, శ్రీపాద జిత్‌ మోహన్‌ మిత్రా,రాయపురెడ్డి చిన్నా, నల్లం శ్రీను, చవ్వాకుల సుబ్రహ్మణ్యం వైకాపా యువ నాయకులు రౌతు సూర్యవరుణ్‌, సప్పా రమణ, కంది రాఘవ, పొదిలాపు నాగేంద్ర తదితరులు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here