మాట నిలబెట్టుకున్న జగన్‌

0
158
ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవిపై మైనార్టీల హర్షం
రాజమహేంద్రవరం, ఆగస్టు 13 :రాష్ట్రంలో ముస్లింలను సాంఘికంగా, ఆర్థికంగా, విద్య వైద్య ఉద్యోగ ఆరోగ్య రంగాలతో పాటు రాజకీయంగా కూడా అత్యున్నత స్థానాల్లో నిలబడతానని ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ముస్లీం సామాజికవర్గానికి చెందిన మాజీ ఐజి మహమ్మద్‌ ఇక్బాల్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చి తన మాటను నిలబెట్టుకున్నారని  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మైనార్టీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్‌ ఆరిఫ్‌ అన్నారు. స్థానిక జాంపేటలోని కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అనంతపురం జిల్లా హిందూపురం శాసనసభకు కు వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన మైనార్టీ నేత, రాయలసీమ మాజీ ఐజి మహమ్మద్‌ ఇక్బాల్‌ కు శాసనమండలిలో స్థానం కల్పించడం ద్వారా ముస్లింలను శాసనసభ, మంత్రివర్గం తోపాటు శాసనమండలిలో కూడా స్థానం కల్పించిన ఏకైక ముఖ్యమంత్రిగా జగన్మోహన్‌ రెడ్డి చరిత్రకెక్కారని అన్నారు.  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అసెంబ్లీకి పోటీ చేసిన ఐదుగురు అభ్యర్థుల్లో నలుగురు విజయం సాధించగా ఓడిపోయిన ఆ ఒక్క అభ్యర్థిని కూడా ఈరోజు శాసనమండలికి పంపించి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి మైనారిటీల సంక్షేమం పట్ల తన చిత్తశుద్ధిని మరోసారి నిరూపించుకున్నారని అన్నారు. ప్రభుత్వ ఏర్పాటైన రెండున్నర నెలల లోపే నలుగురు శాసనసభ్యులు వారిలో ఒక ఉపముఖ్యమంత్రి, ఒక శాసన మండలి సభ్యుడు ముస్లిం సమాజం నుంచి ప్రాతినిధ్యం కల్పించిన జగన్మోహన్‌ రెడ్డికి ముస్లీం సమాజం అంతా అండగా నిలబడాలన్నారు. ముస్లిం సమాజానికి ఇస్తున్న ప్రాముఖ్యత ద ష్ట్యా ముస్లిం యువకులు రాజకీయాల్లోకి వచ్చి, అభివ ద్ధి సాధించి భవిష్యత్తులో ప్రతి రంగంలోనూ తనదైన ముద్ర వేసేందుకు ముస్లిం సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here