మాతృభూమికి ఎన్నారైల సేవలు అభినందనీయం

0
571
కాళీ స్పెషల్‌ స్కూల్‌లో బ్యాగ్‌లు పంపిణీ చేసిన తానా ప్రతినిధి చుండ్రు సతీష్‌
రాజమహేంద్రవరం, ఆగస్టు 16 : ఉద్యోగాల నిమిత్తం విదేశాలలో ఉన్న జన్మనిచ్చిన మాతృభూమిని మరువకుండా పేద వారికి, ప్రభుత్వ పాఠశాలల వృద్ధికి ఎన్నారైలు అందిస్తున్న సేవలు అభినందనీయమని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు. తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) ఆధ్వర్యంలో 42వ డివిజన్‌లోని కాళీ స్పెషల్‌ ఎలిమెంటరీ స్కూల్‌లో 150 మంది విద్యార్ధులకు తానా ప్రతినిధి, గన్ని కృష్ణ అల్లుడు చుండ్రు సతీష్‌ పర్యవేక్షణలో స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేశారు. ముఖ్యఅతిధిగా గన్ని కృష్ణ పాల్గొని విద్యార్ధులకు వాటిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో తానా ద్వారా  ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నో రకాల సేవా కార్యక్రమాలను చేపడుతున్నారని, ఇటీవలే పశ్చిమగోదావరి జిల్లాలో రూ.2కోట్లతో ప్రభుత్వ పాఠశాలల్లో అదనపు తరగతి గదుల నిర్మాణం, డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ల నిర్మాణం చేపట్టారని తెలిపారు. తానా నుంచే గోదావరి ఎన్నారై అసోసియేషన్‌గా ఏర్పడి త్వరలోనే మరిన్ని బృహత్తరమైన కార్యక్రమాలు చేపట్టేందుకు వారు సన్నద్ధమవుతున్నారని తెలిపారు. గోదావరి ఎన్నారైస్‌ కో-ఆర్డినేటర్‌ సుబ్బారావు ఇటీవలే తనతో కలిసి జిల్లాకు చేయబోయే కార్యక్రమాలను వివరించారని, ఆ విషయంలో జిల్లా కలెక్టర్‌, జెడ్పీ చైర్మన్‌తో కలిసి వివరిస్తామని, పంచాయితీ పరిధిలో ఉండే పాఠశాలల్లో డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌లు, తరగతి గదుల నిర్మాణానికి ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. తన అల్లుడైన చుండ్రు సతీష్‌ స్వాతంత్య్ర దినోత్సవంనాడు స్వగ్రామమైన వెదురుమూడిలో పేద విద్యార్ధులకు బ్యాగ్‌లు పంపిణీ చేశారని, ఈరోజు కాళీ స్కూల్‌లో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పాఠశాలలో త్వరలోనే డిజిటల్‌ క్లాస్‌ రూమ్‌ను తానా సభ్యులు నిర్మిస్తారని పేర్కొన్నారు. చుండ్రు సతీష్‌ మాట్లాడుతూ తానా ద్వారా అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్ధులకు గత ఐదు సంవత్సరాల నుంచి స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేస్తున్నామని, అయితే స్వగ్రామంలో సేవా కార్యక్రమాలు నిర్వహించాలన్న సంకల్పంతో స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌ మాట్లాడుతూ సంపాదనే ధ్యేయంగా కాకుండా జన్మనిచ్చిన ఊరికి మేలు చేయాలన్న ఆలోచనతో ఎన్నారైల చేపడుతున్న కార్యక్రమాలు నిరుపమానమన్నారు. డివిజన్‌ కార్పొరేటర్‌ మళ్ళ నాగలక్ష్మి మాట్లాడుతూ తన డివిజన్‌లో తానా సభ్యులు కార్యక్రమం నిర్వహించి స్కూల్‌ బ్యాగ్‌లు పంపిణీ చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకర్‌, శ్రియ, టిడిపి నాయకులు మళ్ళ వెంకట్రాజు, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎ.సుజాత, నాగరాజా హైస్కూల్‌  ప్రధానోపాధ్యాయులు చక్రధర్‌, ఎం.ఏ.రషీద్‌, భైరవ, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here