మార్కెట్‌యార్డ్‌ వద్ద గణపతి నవరాత్రుల ముగింపు అన్నదానం

0
52
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 13 : గణపతి నవరాత్రుల ముగింపు సందర్భంగా స్థానిక వ్యవసాయ మార్కెట్‌ యార్డ్‌ వద్ద మాజీ కార్పొరేటర్‌ పరిమి వాసు సారధ్యంలో ది రాజమండ్రి సెంట్రింగ్‌ అండ్‌ బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన  అన్న సమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిధులుగా గుడా మాజీ చైర్మన్‌ గన్ని కృష్ణ, సిటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, పార్టీ నాయకులు ఆదిరెడ్డి వాసు పాల్గొని అన్న సమారాధన ప్రారంభించారు.భక్తి శ్రద్దలతో వినాయకచవితి ఉత్సవాలను నిర్వహించి అన్నదాన కార్యక్రమం నిర్వహించిన అసోసియేషన్‌ సభ్యులను అతిధులు అభినందించారు. ఈ కార్యక్రమంలో సుంకర వెంకటేశ్వరరావు, మాచిరాజు,పివిఆర్‌, కె.ప్రకాష్‌, ఎల్‌. రమణ, ఎం.మహేష్‌, వినాయకరావు,గణేష్‌ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here