మార్గానిని సత్కరించిన బిసి సంఘం నేతలు 

0
332
రాజమహేంద్రి, నవంబర్‌ 17 : ఆంధ్రప్రదేశ్‌ బిసి సంక్షేమ సంఘం జెఏసి కన్వీనర్‌గా నియమితులైన మార్గాని నాగేశ్వరరావును ఆయన స్వగృహంలో రాజమహేంద్రి అర్బన్‌ జిల్లా బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు మజ్జి అప్పారావు ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఆంధ్రప్రదేశ్‌లో బిసి కులాలకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ బిసిల అభివృద్ధికి నిరంతరంపాటు పడుతున్న మార్గాని నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్‌ బిసి సంఘానికి, బిసి కులాలకు జెఏసి కన్వీనర్‌ అవడం బిసిలందరికీ ఎంతో ఆనందదాయకమని మజ్జి అప్పారావు అన్నారు. జెఏసీ కన్వీనర్‌గా 13 జిల్లాలలో పర్యటించి బిసిల అభివృద్ధికి మరింత పాటుపడాలన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగుల సూర్యారావు మాట్లాడుతూ బిసిల పట్ల నిబద్ధత కలిగి బిసి సమస్యలపై నిరంతరం పాటుపడుతున్న మార్గాని బిసిలకు మరింత సేవ చేయాలన్నారు. మార్గాని నాగేశ్వరరావు మాట్లాడుతూ నాపై ఉంచిన బాధ్యతను నాకు అప్పగించిన విధులను సక్రమంగా నిర్వర్తిస్తూ, త్వరలో 13 జిల్లాలలో పర్యటించి బిసిల సమస్యలను తెలుసుకొని బిసిల కోసం నిరంతరం పాటుపడతానన్నారు. ఈ కార్యక్రమంలో  బిసి నాయకులు పితాని తారకేశ్వరరావు, దొమ్మేటి సోమశంకరం, గోలి రవి, ముచ్చకర్ల నూకరాజు, ఎం.డి.మున్నా, దాడి శ్రీను, కె.రమణ, గాంధీ, చిన్నారావు పాల్గొన్నారు.