మార్గాని రామకృష్ణ గౌడ్‌ కన్నుమూత

0
314
రాజమహేంద్రవరం, అక్టోబరు 19 : ఏ.పీ. బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కో-ఆర్డనేటర్‌, ఆర్యాపురం అర్బన్‌ బ్యాంకు మాజీ డైరక్టర్‌ మార్గాని రామకృష్ణ గౌడ్‌ (68) కన్నుమూసారు. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనను మెరుగైన వైద్యం కోసం హైదరాబాదుకు తరలించారు. చికిత్స పొందుతూ ఈ ఉదయం ఆయన తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఆయనకు భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుమారుడు మార్గాని సురేష్‌ నగర పాలక సంస్థ కాంట్రాక్టరుగా వ్యవహరిస్తున్నారు. రెండు దశాబ్ధాలకు పైగా రాజకీయ రంగంలో పలు పదవుల్లో సేవలందించిన ఆయన బిసి ఉద్యమాన్ని బలోపేతం చేసే విషయంలో ప్రత్యేక శ్రద్ధను కనబరిచారు. కాంగ్రెస్‌ పార్టీలో, ఇటు బిసి ఉద్యమంలోను అందరితో కలుపుగోలుగా వ్యవహరించే ఆయన ఏసీవై రెడ్డి అనుచరునిగా క్రియాశీలక రాజకీయాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత  మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావుతో పయనం సాగించారు. రామకృష్ణ గౌడ్‌ మరణ వార్త తెలుసుకొని వైకాపా సిటీ కోఆర్డినేటర్‌ రౌతుసూర్యప్రకాశరావు, సిసిసి ఎండీ పంతం కొండలరావు, బిసి నాయకులు రెడ్డి రాజు, నరవ గోపాలకృష్ణ, నక్కెళ్ళ బాబూరావు, వెలిగట్ల పాండు రంగారావు  తదితరులు వెళ్లి పరామర్శించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here