మీ త్యాగాలు మరువలేము

0
293
పోలీస్‌ అమరవీరులకు ఘనంగా నివాళి 
 
రాజమహేంద్రవరం, అక్టోబర్‌  21 : సమాజంలో శాంతిభద్రతలను కాపాడేందుకు ప్రాణాలను అర్పించిన అమర పోలీసుల త్యాగాలు మరువలేమని అర్బన్‌ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి అన్నారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు మొబైల్‌ పోలీస్‌ రిజర్వ్‌ గ్రౌండ్స్‌లో పెరేడ్‌ నిర్వహించారు. పోలీసుల నుంచి అర్బన్‌ ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ఈ ఏడాది రాష్ట్రంలో 14 మంది, దేశంలో 473 మంది పోలీసులు అమరులయ్యారని తెలిపారు.ఈ పెరేడ్‌కు ముఖ్య అతిధులుగా మేయర్‌ పంతం రజనీ శేషసాయి, సిటీ   ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ, రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అమర వీరుల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు అనంతరం కోటిపల్లి బస్టాండ్‌ నుంచి కోటగుమ్మం సెంటర్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ గంగాధరరావు, డిఎస్పీలు సత్యానందం, రామకృష్ణ, శ్రీనివాసరావు, కులశేఖర్‌, రమేష్‌బాబు, శ్రీకాంత్‌, శ్రీనివాసరెడ్డి,  సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.