ముఖ్యమంత్రి పర్యటనపై గోరంట్ల సమావేశం

0
281
రాజమహేంద్రవరం, నవంబర్‌ 12 : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈనెల 19న నగర పర్యటనకు విచ్చేస్తున్న సందర్భంగా రూరల్‌ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి తన నివాసంలో అధికారులతో సమావేశమయ్యారు. సిటీ, రూరల్‌ నియోజకవర్గాల్లో ముఖ్యమంత్రి పర్యటన ఉండటంతో చేపట్టవలసిన ఏర్పాట్లపై పలు సూచనలు చేశారు. డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఆర్‌ అండ్‌ బి, విద్యుత్‌, హౌసింగ్‌, పంచాయతీ, నగరపాలక సంస్థ, రెవిన్యూ, ఇంజనీరింగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల ఎస్‌ఇ, ఇఇ, డిఇ, ఎఇలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.