ముగిసిన పాత సోమాలమ్మ జాతర ఉత్సవాలు

0
288

రాజమహేంద్రవరం, మార్చి 3 : 150 సంవత్సరాల చరిత్ర కలిగిన రాజమహేంద్రవరం గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పాత సోమాలమ్మ తల్లి జాతర ఉత్సవలు ఈరోజు ఘనంగా ముగిశాయి. ఉదయం సౌభాగ్య వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈరోజు అమ్మవారిని నగరపాలక సంస్థ కమిషనర్‌ వేగేశ్న విజయరామరాజు, ఎస్‌.ఎన్‌.రాజా, జక్కంపూడి రాజా తదితరులు దర్శించుకుని అమ్మవారి ఆశీస్సులు పొందారు. సాయంత్రం 4 గంటలకు అమ్మవారిని సేవిస్తూ చేసిన భేతాళ నృత్యం, గరగలు, కోయ నృత్యం, గారడీల నృత్యం భక్తులను విశేషంగా అలరించాయి. నిన్న సాయంత్రం 6 గంటలకు నిర్వహించిన అమ్మవారి ప్రసాదం లడ్డూని వేలం పాటలో ప్రముఖ కాంట్రాక్టర్‌ ఆకుల రాంబాబు రూ.90వేలకు సొంతం చేసుకున్నారు. అనంతరం మేళతాళాలతో, వివిధ నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు పురవీధులలో జరిగింది. ఈ జాతర మహోత్సవానికి సహకరించిన భక్తులకు, పుర జనులకు, మీడియాకు ఉత్సవ కమిటీ తరపున గొర్రెల సురేష్‌ కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా పాత సోమాలమ్మ జాతర సందర్భంగా సమన్వయ సరస్వతి, వాగ్ధేవి వరపుత్ర బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ ఈనెల 6న ఉదయం 11 గంటలకు ఆలయానికి విచ్చేస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here