ముస్లింలపై దాడులను ఖండిస్తున్నాం

0
315

రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 17 : ముస్లింలు తమ పార్టీ గెలుపునకు అడ్డుపడుతున్నారనే నెపంతో ముస్లింలపై తెలుగుదేశం పార్టీ నాయకులు, గుండాలు దాడులకు పాల్పడుతున్నారని వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మొహమద్‌ ఆరిఫ్‌ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఈనెల 11వ తేదీన గుంటూరు జిల్లా గురజాలలో తెలుగుదేశం కార్యకర్తలు ముస్లిం సామాజిక వర్గం పై జరిపిన పైశాచిక దాడిని అందరూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. పోలింగ్‌ సమయంలో గురజాల ముస్లిం మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించడమే కాక వారి ఇళ్లపై దాడులు చేసి వారి ఆస్తులను ధ్వంసం చేసి కర్రలతో మారణాయుధాలతో భయభ్రాంతులకు గురి చేశారని, దాడికి పాల్పడిన గూండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు.రాష్ట్రమంతటా సీసీ కెమెరాలతో పటిష్టమైన భద్రత నడుమ ఎన్నికలు నిర్వహిస్తున్నామని చెబుతున్న పోలీసులు ముస్లిం సామాజిక వర్గమే లక్ష్యంగా దాడులు జరుగుతుంటే స్పందించకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఈ దాడులకు స్థానిక పోలీసులు సహకరించడం వల్లనే జరిగినట్లు సమాచారం ఉందని చెప్పారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.తమ ఓటమిని ముందుగానే ఊహించిన తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ నెపాన్ని ముస్లింలపై నెట్టే విధంగా నీచమైన ప్రయత్నాలు చేస్తున్నారని, తద్వారా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వెంటే ముస్లింలందరూ   ఉన్నారన్న విషయాన్ని వారి చేతల ద్వారా నిరూపిస్తున్నారు అని అన్నారు. అదేవిధంగా రాజుపాలెం మండలం ఇనిమెట్ల గ్రామంలో జరిగిన ఘర్షణలకు రాష్ట్ర స్పీకర్‌ కోడెల శివప్రసాద్‌ కారణమని గౌరవప్రదమైన స్పీకర్‌ స్థానంలో ఉండి ఒక పోలింగ్‌ బూత్‌ లో గంటన్నర పాటు కూర్చుని ప్రభావితం చేయడానికి ప్రయత్నించారని చెప్పారు. దీంతో గ్రామంలోని ప్రజలు తిరగబడతారని ఈ విషయంపై కూడా ఉన్నత అధికారులు సమగ్రంగా విచారణ జరపాలని డిమాండ్‌ చేశారు. గడిచిన ఐదు సంవత్సరాలుగా అభివ ద్ధి సంక్షేమాలకు ముస్లిం సామాజిక వర్గాన్ని దూరంచేసి ముస్లింల వెనుకబాటుతనానికి కారణమైన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇప్పుడు ముస్లింలపై భౌతిక దాడులకు తెగబడుతుంటే చూస్తూ ఊరుకోమని, చట్టపరంగా ఏ స్థాయిలోనైనా వీటిని ఎదుర్కొని తామంతా ముస్లింలకు రక్షణ కవచంగా నిలబడతామని భరోసా ఇచ్చారు. ముస్లిం సామాజిక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని తెలుగుదేశం పార్టీకి చేసిన ఈ దాడులకు జరిగిన ఎన్నికలలో తగిన రీతిలో ముస్లింలందరూ గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here