మూడవ రోజుకి చేరిన జక్కంపూడి రాజా దీక్ష

0
269
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 4 : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పధకంలో భూములు కోల్పోయిన రైతులకు న్యాయం చేయాలని కోరుతూ రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం రఘుదేవపురం గ్రామంలో వై.ఎస్‌.ఆర్‌.కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులు జక్కంపూడి రాజా చేస్తున్న రైతు సత్యాగ్రహ నిరహరదీక్ష మూడోవ రోజుకి చేరుకుంది. రాజాకు పెద్ద ఎత్తున నియోజకవర్గ రైతులు, నాయకులు, భవన నిర్మాణ సంఘం నాయకులు మద్దతు తెలిపారు. నార్త్‌ జోన్‌ డిఎస్పీ శ్రీనివాస రావు, ఎండిఓ శ్రీనివాస్‌, ఎమ్మార్వో చంద్రశేఖర్‌ ఈరోజు దీక్షా శిబిరానికి వచ్చి రాజా ఆరోగ్యం కోసం తెలుసుకొని దీక్ష విరమించాలని కోరారు.
న్యాయం జరిగే వరకు దీక్ష విరమించేది లేదని రాజా స్పష్టం చేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here