మూడురోజులపాటు సువార్త సంగీత మహోత్సవాలు

0
112
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 3 : జాన్‌ వెస్లీ  ఇంటర్నేషనల్‌ మినిస్ట్రీస్‌ ఆధ్వర్యంలో నేటి నుండి మూడురోజులపాటు ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో జరుగుతున్న సువార్త సంగీత మహొత్సవాలను జయప్రదం చేయాలని ప్రపంచ వ్యాప్తంగా శాంతికోసం సువార్తను అందిస్తున్న దైవజనులు డాక్టర్‌ జాన్‌ వెస్లీ కోరారు. స్థానిక మల్లిఖార్జున నగర్‌లోని ఆయన స్వగృహాంలో ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 60 దేశాల్లో పర్యటించి ప్రపంచ శాంతి కోసం దేవుని సువార్తను ప్రకటించినట్లు తెలిపారు. రాజమహేంద్రవరం నగర ప్రజల శాంతి కోసం  ఈ నెల మూడు, నాలుగు, ఐదు తేదీల్లో సంగీత మహోత్సవాలను ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్సవాల్లో ప్రముఖ సంగీత దర్శకులు అనూప్‌ రూబెన్స్‌, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్లూటిస్ట్‌ నవీన్‌ ఈ మూడు రోజుల సంగీత ఉత్సవాల్లో పాల్గొంటున్నారని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సంగీత మహోత్సవాలు నిర్వహిస్తున్నామని, ఈ ఏడాది ఇప్పటికే వరంగల్‌, బొబ్బిలి కేంద్రాల్లో ఈ సంగీత ఉత్సవాలను నిర్వహించినట్లు వెల్లడించారు. యువతలో మంచితనాన్ని పెంపొందించే లక్ష్యంతోపాటు, యువత చెడు అలవాట్లకు బానిసలు కాకుండా ఉండేందుకు క్వారీ ఏరియాలోని తమ చర్చిలో జాన్‌వెస్లీ ఫౌండేషన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు.యువతకు సంగీతం పట్ల అభిరుచిని కల్పించాలన్న సంకల్పంతో ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, కావున రాజమహేంద్రవరం నగరానికి చెందిన యువత ఈ సంగీత ఉత్సవాల్లో పాల్గొని జయప్రదం చేయాలని ఆయన కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here