మూడు నియోజకవర్గాల్లో గన్నివిస్తృత ప్రచారం

0
166
అడుగడుగునా అపూర్వ ఆదరణ
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 2 : ఎన్నికల తేది సమీపిస్తున్న నేపధ్యంలో గుడా చైర్మన్‌ గన్నికృష్ణ జిల్లాలో సుడిగాలి పర్యటన చేస్తూ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధుల విజయానికి ప్రచారం చేస్తున్నారు. ముందుగా పెద్దాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ ఎంపి అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌తో కలిసి ఇంటింటికి వెళ్ళి సైకిల్‌ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబును మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు. అనంతరం రాజమహేంద్రవరం పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్ధి నల్లమిల్లి రామకృష్ణారెడ్డితో కలిసి పలు ప్రాంతాల్లో విస్తృత ప్రచారం నిర్వహించారు. అనంతరం రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలోని శాటిలైట్‌ సిటి డి.బ్లాక్‌లో ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర అభివృద్ధికి సిఎం చంద్రబాబు చేస్తున్నకృషిని వివరించి తెదేపా అభ్యర్ధులను గెలిపించి చంద్రబాబు నాయకత్వాన్ని బలపరచాలని కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి అన్యాయం చేయడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న చంద్రబాబు పై ప్రధాని నరేంద్ర మోడి అసత్యాలు వల్లించారని,ఇంతవరకు రాష్ట్రానికి ఏమి చేశారో, ఎన్ని నిధులు అందించారో చెప్పలేదన్నారు.ఆంధ్రప్రదేశ్‌ జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు, రాష్ట్ర రాజధాని నిర్మాణానికి మోడీ అడ్డుపడటం లేదా అని ప్రశ్నించారు. నాలుగేళ్ళు నమ్మించి మోసం చేయడం వల్ల ఎన్‌.డి.ఎ.కూటమి నుంచి బయటకు వచ్చి ఆంద్రప్రదేశ్‌కి జరిగిన అన్యాయంపై పోరాడుతున్నారని,ఈ క్రమంలో కెసిఆర్‌,జగన్‌ లు మోడితో జతకట్టి రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ తరుణంలో రాష్ట్ర ప్రజలు చంద్రబాబుకు అండగా నిలవాలని కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here