మూడు రాజధానులను ఆంధ్రులందరూ వ్యతిరేకించాలి

0
92
– కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఎన్టీఆర్‌కు నివాళులు
రాజమహేంద్రవరం, జనవరి 18 : మూడు రాజధానుల నిర్ణయాన్ని ఆంధ్రులందరూ వ్యతిరేకించాలని గుడా ప్రధమ చైర్మన్‌, టీడీపీ సీనియర్‌ నాయకులు గన్ని కృష్ణ పిలుపునిచ్చారు. అమరావతిని రాజధానిగా కొనసాగించాలని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న పోరాటానికి మద్ధతుగా నిలవడమే టీడీపీ వ్యవస్ధాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకు నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఎన్టీఆర్‌ 24వ వర్థంతి సందర్భంగా స్థానిక కోటిపల్లి బస్టాండ్‌ వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలుగుజాతి బతికున్నంతకాలం ఎన్టీఆర్‌ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు. చలన చిత్ర రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందిన నందమూరి తారకరామారావు తెలుగు రాజకీయాలలో చరిత్ర సృష్టించి అవినీతి మచ్చలేని స్వచ్చమైన పాలన అందించారని కొనియాడారు. తెలుగు ప్రజలు రాముడు, కృష్ణుడు, ప్రజానాయకుడిగా, శివుడిగా ఎన్నో పాత్రలు పోషించి వాటికి జీవం పోసారన్నారు. పేద ప్రజల సంక్షేమమే లక్ష్యమంగా ఎన్నో  పథకాలను అమలు చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపారని గుర్తుచేసారు. మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పిస్తే దాన్ని దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు అమలు చేయడం ఎన్టీఆర్‌ ఘనతకు నిదర్శనమన్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేస్తే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం మూడు ముక్కలు చేస్తోందని ధ్వజమెత్తారు. ఆంధ్రులందరూ మూడు రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకించి తమ వాణిని ప్రజలకు బలంగా వినిపించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు, ఎస్సీ కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌ కాశి నవీన్‌, మాజీ కార్పొరేటర్లు కురగంటి సతీష్‌,బెజవాడ రాజ్‌కుమార్‌, కూరాకుల తులసి, బూర దుర్గాంజనేయరావు, గొందేశి మాధవీలత, కోసూరి చండీప్రియ, రెడ్డి పార్వతి, రూరల్‌ మాజీ ఎంపీపీ రేలంగి వీరవెంకట సత్యనారాయణ, బొమ్మూరు మాజీ సర్పంచ్‌ మత్సేటి శివసత్యప్రసాద్‌, టీడీపీ నాయకులు మండవిల్లి శివ, తవ్వా రాజా, మజ్జి రాంబాబు, పెనుగొండ రామకృష్ణ, చించినాడ తాతాజీ, మొల్లి చిన్నియాదవ్‌, గరగా మురళీకృష్ణ, కవులూరి వెంకట్రావు, ముత్య సత్తిబాబు, నల్లం ఆనంద్‌, ఉప్పులూరి జానకిరామయ్య, పెయ్యల శ్రీను, కొయ్యాన కుమారి, టివి రాము, బెజవాడ వెంకటస్వామి, దాలిపర్తి వేమన తదితరులు పాల్గొన్నారు.
టీడీపీ కార్యాలయం వద్ద..
స్థానిక గోకవరం బస్టాండ్‌ వద్దనున్న తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు వర్థంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. గుడా ప్రధమ చైర్మన్‌ గన్ని కృష్ణ, మాజీ డిప్యూటీ మేయర్‌ వాసిరెడ్డి రాంబాబు తదితరులు ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here