మూల్‌ నివాసీ సంఘ్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ వర్థంతి

0
248
రాజమహేంద్రవరం, డిసెంబర్‌ 8 : రాజానగరం మండలం దివాన్‌చెరువు, తోకాడలో గ్రామంలో డాక్టర్‌ అంబేద్కర్‌ వర్థంతి నిర్వహించారు. ఈ కార్యక్రమం మూల్‌ నివాసీ సంఘ్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా తోకాడ, దివాన్‌చెరువు, రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలలో అనేకమంది పేదలకు, వృద్ధులకు దుప్పట్లు పంచారు. ఈ కార్యక్రమంలో మూల్‌ నివాసీ సంఘ్‌ రాష్ట్ర అధ్యక్షులు మార్గాని చంటిబాబు, మూల్‌ నివాసీ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్రయాదవ్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల లక్ష్మీపతిరావు, లక్ష్మణ్‌, సుందర్‌, వీర్రాజు, ప్రవీణ్‌, రాంపండు పాల్గొన్నారు.