మెయిన్‌రోడ్డులో ఆదిరెడ్డి ప్రచారం

0
183
రాజమహేంద్రవరం,  ఏప్రిల్‌ 3 :   ఈ ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్ధులను అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మెయిన్‌ రోడ్డులోని నల్లమందు సందులో ఎన్నికల ప్రచారం చేశారు. నల్ల మందు సందులోని ప్రతి షాపునకు వెళ్లి కర పత్రాలు పంపిణీ చేసి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇవ్వాలని కోరారు. తెలుగుదేశం పార్టీ తరపున రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గానికి పోటీ చేస్తున్న ఆదిరెడ్డి భవానీ, పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేస్తున్న మాగంటి రూపకు ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వ్యాపారస్తులు వారి వ్యాపారాలు సజావుగా చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చంద్రబాబు నాయుడు సంస్కరణలు చేస్తారని అన్నారు. వ్యాపార సంస్థల అభివ ద్ధికి సహకారం అందిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యాపురం బ్యాంకు ఛైర్మన్‌ చల్లా శంకరరావు, ఛాంబర్‌ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, కార్పొరేటర్‌ బెజవాడ రాజ్‌కుమార్‌, మాజీ కార్పొరేటర్‌ మంచాల బాబ్జి, ఆర్యాపురం బ్యాంకు డైరెక్టర్‌ సూరంపూడి శ్రీహరి, చందా సత్రం ట్రస్ట్‌ బోర్డు ఛైర్మన్‌ ఇన్నమూరి రామసాయిదీపు  పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here