మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట

0
114
మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపి భరత్‌
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : రాష్ట్రంలో ముస్లీం, మైనారిటీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ అన్నారు. స్థానిక దానవాయిపేటలోని మదీనా  మసీదు సాధీఖానాలో జిల్లా మైనారిటీ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో ముస్లీం, మైనారిటీ మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం మాజీ వక్స్‌ బోర్డు ఛైర్మన్‌ ఎండి కరీంఖాన్‌ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎంపీ మార్గాని భరత్‌  రామ్‌,వైకాపా రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌, ఎపిఐఐసి మాజీ ఛైర్మన్‌ శ్రిఘాకొళ్ళపు శివరామసుబ్రహ్మణ్యం,  మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, వైకాపా సిజిసి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి, వైకాపా రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ కో-ఆర్డినేటర్‌ ఆకుల వీర్రాజు, నగర వైకాపా అధ్యక్షుడు నందెపు శ్రీనివాసు, నగర పాలక సంస్థ వైకాపా మాజీ ఫ్లోర్‌లీడర్‌ మేడపాటి షర్మిలారెడ్డి, వైకాపా నాయకులు బొమ్మన రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ మార్గాని భరత్‌ రామ్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోని ముస్లీం, మైనారిటీల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని అన్నారు. ముఖ్యంగా హజ్‌యాత్రకు వెళ్లాలనుకునే వారికి ఆయా ఆర్థిక స్థాయిని బట్టి ముస్లీంలకు ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారని తెలిపారు. మైనారిటీ కార్పొరేషన్‌ ద్వారా ముస్లీం మహిళలకు కుట్టు మిషన్‌పై శిక్షణ ఇచ్చిన అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టుమిషన్లను ఉచితంగా అందిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని ముస్లీం మహిళలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ముస్లీం మహిళలు ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు వాకచర్ల కృష్ణ, ఇసుకపల్లి శ్రీనివాస్‌, వైకాపా మైనారిటీ సెల్‌ నాయకులు ఆరిఫ్‌, చాన్‌ భాషా, ఎండి హసీనా, హసన్‌, అమనుల్లా భేగ్‌, సయ్యద్‌ మదీనా, తాతా సాహెబ్‌, షేక్‌ షరీఫ్‌, సాజహాన్‌, ఎ-1 నయీం భాయ్‌, మెహీద్దీన్‌ పిచ్చాయ్‌,  వైకాపా నాయకులు అడపా రాజు, కంది రాఘవ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here