మొక్కలు నాటుదాం…పర్యావరణాన్ని కాపాడదాం

0
169

పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్టు పిలుపు
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 26 :  పంతం సత్యనారాయణ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో మూడవ దశలో మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా రాజమండ్రి 42 వ డివిజన్‌ మార్కెట్‌ యార్డులో నామన ధనరాజు జ్ఞాపకార్దంగా వారి కుమారులు నామన వాసు నేను సైతం అంటూ తన లలితానగర్‌ ప్రెండ్‌ సర్కిల్‌తో వచ్చి మొక్కలు నాటే  కార్యక్రమానికి పూర్తి సహకారం అందించారు. ట్రీ గార్డులను ఉచితంగా అందించిన రాజానగరం ఎమ్మెల్యే, కాపు కార్పోరేషన్‌ చైర్మన్‌ జక్కంపూడి రాజాకు ట్రస్టు నిర్వాహకులు  పంతం కొండలరావు ట్రస్టు తరపున   కృతజ్ఞతలు తెలియజేశారు. నగర పాలక సంస్ధలో  2002 సంవత్సరం నుంచి 2019 సంవత్సరం వరకూ సేవలు అందించిన పలువురు మాజీ మహిళా కార్పోరేటర్లు పాల్గొని  మొక్కలు నాటారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా  ఆర్యాపురం అర్బన్‌ బ్యాంకు మాజీ చైర్మన్‌ చల్లా శంకర్రావు, గౌతమ ఘాట్‌ ఆధ్యాత్మిక సంస్ధల సమాఖ్య చైర్మన్‌ తోట సుబ్బారావు , మార్కెట్‌ యార్డు కమిటీ సెక్రటరీ అమ్మాజీ వారి సిబ్బంది విచ్చేశారు.ఆదిత్య సంస్దల డైరక్టర్‌ ఎస్‌.పి .గంగిరెడ్డి ఆధ్వర్యంలో ప్రిన్సిపాల్‌ కె.సి సాగర్‌, ఎన్‌.ఎస్‌.ఎస్‌ ఫోగ్రాం ఆపీసర్‌ జి.వి.ఎస్‌. నాగేశ్వరరావు, లెక్టరర్‌ వంశీ,భరద్వాజ అరుణ్‌ కుమార్‌ ,విద్యార్దులు మొక్కలు నాటారు. అనంతరం పంతం సత్యనారాయణ ఛారిటబుల్‌ ట్రస్టు సభ్యులు, స్నేహితులు, మహిళా కార్పోరేటర్లు, ఆదిత్యవిద్యాసంస్ధల ఎన్‌.ఎస్‌ ఎస్‌ వాలంటీర్లు బేనర్లతో ఊరేగింపుగా బయిలు దేరారు. ఈ కార్యక్రమంలో  మాజీ కార్పోరేటర్లు ప్రసాదుల హరనాధ్‌, కంచుమర్తి చంటి, ఇసుకపల్లి శ్రీవివాస్‌, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here