మోడీ నిరంకుశత్వం పై సంఘటిత పోరాటం

0
201
పవన్‌, జగన్‌లు ఏమీ చేయలేరు – 23 వ డివిజన్‌లో తెదేపా నగర దర్శిని
రాజమహేంద్రవరం, నవంబర్‌ 13 : ప్రధాని మోడీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపై జాతీయ స్థాయిలో సిఎం చంద్రబాబు అన్ని రాజకీయ పార్టీలను కలిపి సంఘటిత పోరాటం చేస్తున్నారని గుడా చైర్మన్‌ గన్ని  కృష్ణ  అన్నారు. స్థానిక 23 డివిజన్‌లో కార్పొరేటర్‌ యిన్నమూరి రాంబాబు ఆధ్వర్యంలో  ఈరోజు తెలుగుదేశం పార్టీ నగరదర్శిని కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఎన్‌.టి.ఆర్‌.విగ్రహానికి గన్ని  కృష్ణ, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌ డైరెక్టర్‌ కాశి నవీన్‌, పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి వాసు, కార్పొరేటర్‌ మాటూరి రంగారావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గన్ని  కృష్ణ  మాట్లాడుతూ కేంద్రంపై చేస్తున్న సంఘటిత పోరాటానికి ఎప్పుడూ కలవని కాంగ్రెస్‌తో కలవాల్సి వచ్చిందన్నారు. మోడీ నిరంకుశత్వం, నియంతృత్వం, వాగ్దానాలు నెరవేర్చని విధానాన్ని ప్రజలకు వివరిస్తున్నారన్నారు. చంద్రబాబు అందరికి ఆమోదయోగ్యుడని, జైలు పక్షి  జగన్‌, సినిమా పక్షి పవన్‌ సహా ఎవరు ఎదురైనా ఏమీ చేయలేరని పేర్కొన్నారు. లక్షలాది మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, కోట్లాది మంది ప్రజల మద్దతు చంద్రబాబుకు ఉందన్నారు. సంక్షేమ పధకాల్లో లోటుపాట్లు, ప్రజల సంతృప్తి తెలుసుకునేందుకు నిరంతరం ప్రజల్లో ఉండేలా చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారని అన్నారు. టిడిపి జెండా సగర్వంగా ఎగిరేలా చంద్రబాబు వాగ్దానాలు నెరవేర్చారని అన్నారు. మేయర్‌ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబే రావాలని, కార్యకర్తలందరూ టిడిపి సభ్యత్వాన్ని తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న 103 సంక్షేమ పధకాలు అందరికి అందేలా చైతన్యం తీసుకురావాలన్నారు. ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ చంద్రబాబు ఆదేశాల మేరకు అలుపెరగకుండా ప్రతి డివిజన్‌లో పర్యటన చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నామన్నారు. పసుపు- కుంకుమ, ఫించన్లు,ఇతర పధకాలు సక్రమంగా అందుతున్నాయో లేదో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుంటున్నామన్నారు. అనంతరం ఇంటింటికి వెళ్ళి ప్రజలను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి మణి, కురగంటి సతీష్‌, యిన్నమూరి దీపు, డివిజన్‌ తెదేపా నాయకులు చించినాడ తాతాజీ, ముత్య సత్తిబాబు, మెహబూబ్‌ ఖాన్‌, మొల్లి చిన్ని యాదవ్‌, పుట్టా సాయిబాబా, కర్రి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here