మోనిక స్టీల్స్‌ రాఘవరావు మృతికి సంతాపం

0
242
రాజమహేంద్రవరం, నవంబర్‌ 15 : మోనిక స్టీల్స్‌ అధినేత పి.వి.రాఘవరావు ఆకస్మిక మృతి పట్ల ది రాజమండ్రి ఐరన్‌, హార్డ్‌వేర్‌ అండ్‌ పేయింట్‌ మర్చంట్స్‌ అసోసియేషన్‌ సంతాపం తెలిపింది.  అసోసియేషన్‌ భవనంలో సంఘ అధ్యక్షులు బత్తుల శ్రీరాములు అధ్యక్షతన సంతాప సభను నిర్వహించారు. రాఘవరావు మృతి పట్ల రెండు నిముషాలు మౌనం పాటించారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు  షాపులు మూసివేసి సంతాపాన్ని వ్యక్తం చేసింది. అసోసియేషన్‌కు సంయుక్త కార్యదర్శిగా రాఘవరావు విలువైన సేవలందించారని స్మరించారు.