యర్రా వేణుకి అసెంబ్లీ టిక్కెట్‌ కేటాయించాలి

0
162
చంద్రబాబుకు కాపు యువసేన నాయకుల వినతి
రాజమహేంద్రవరం, మార్చి 6 : తెలుగుదేశం పార్టీకి ఎనలేని సేవలు అందిస్తున్న కాపు కార్పొరేషన్‌ మాజీ డైరెక్టర్‌, క్రీడా అభివ ద్ధి సంస్థ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాల్‌ రాయుడుకు రాజమహేంద్రవరం అర్బన్‌ సీటును కేటాయించాలని కాపు యువసేన నాయకులు పోతుల నాగ శ్రీనివాస్‌, గొల్లవిల్లి త్రిమూర్తులు, ఎలమంచిలి సత్యనారాయణ, జగన్నాథంలు కోరారు. రాజమహేంద్రవరంలో జరిగిన కాపు యువసేన సమావేశంలో వారు మాట్లాడారు. రాజమహేంద్రవరం, రూరల్‌ సీటులను 2009లో గాని 2014లో గాని కాపులకు కేటాయించలేదని, ఈసారైనా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులకు ప్రాధాన్యత ఇస్తూ ఈ రెండింటిలోనూ ఏదో ఒక సీటును కాపులకు కేటాయించాలని కోరారు. సుదీర్ఘ కాలం పాటు పార్టీకి సేవలు అందిస్తూ ఇటు కాపులకు ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చేదోడువాదోడుగా ఉంటూ తనదైన శైలిలో ముందుకు వెళ్తున్న వేణుగోపాల్‌రాయుడుకు ఈ దఫా అవకాశం కల్పించాలని వారు కోరారు. జిల్లాలో కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం విమర్శలకు ధీటుగా సమాధానమిస్తూ ఎప్పటికప్పుడు కాపులు తెలుగుదేశం పార్టీని అంటిపెట్టుకునే ఉండేలా జాతిని మేల్కొల్పుతున్నారని అన్నారు. అటువంటి వ్యక్తికి ఈసారైనా రాజమహేంద్రవరం, రూరల్‌ నియోజకవర్గాలలో ఏదో ఒక సీటును పార్టీ అధినేత చంద్రబాబు కేటాయించాలని కోరారు. ఈ సమావేశంలో కాపు యువసేన నాయకులు ఎలమంచిలి సత్యనారాయణ, దేవరాపల్లి వీరేష్‌, సాయి, పరమేష్‌, ఏ రాజు, ప్రసాద్‌, సతీష్‌ పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here