యువజనోత్సవ పోటీల్లో విజేతలకు బహుమతులు

0
284
 
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 26 : రోటరీ క్లబ్‌ ఆఫ్‌ రాజమండ్రి ప్రతి ఏటా సెప్టెంబర్‌లో నిర్వహించే యువజన మాసోత్సవాలను ఇటీవల క్లబ్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరక్టర్‌ పట్టపగలు వెంకట్రావ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతకు సాంస్కృతిక, ప్రతిభా పోటీలను నిర్వహించారు. అందులో భాగంగా సాంప్రదాయ నృత్య పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో క్లబ్‌ ప్రెశిడెంట్‌  సీతారామ మహేశ్వరి, సెక్రటరీ పట్టపగలు ప్రకాశరావు, సుంకర రవికుమార్‌, డివి సుబ్బారావు, ఐవి భాస్కరరావు, కెకె సంజీవరావు,ఇన్నర్‌వీల్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ చైర్మన్‌ పట్టపగలు అనంతరామలక్ష్మీ, ప్రెశిడెంట్‌ ఎస్‌ శుభలక్ష్మీ పాల్గొన్నారు.