యూనివర్శిటి ప్రతిష్టకు భంగం కలిగించొద్దు

0
167
ప్రొఫెసర్‌  లైంగిక వేధింపుల ఆరోపణలపై విచారణ జరపాలి
విద్యార్ధినిల రక్షణకు చర్యలు తీసుకోవాలి – ఎస్‌.ఎఫ్‌.ఐ డిమాండ్‌
రాజమహేంద్రవరం, అక్టోబర్‌ 11 : నన్నయ్య విశ్వవిద్యాలయం ఇంగ్లీషు హెడ్‌ ఆఫ్‌ ది డిపార్ట్‌మెంట్‌ ప్రొఫిసర్‌ సూర్యరాఘవేంద్రరావుపై వచ్చిన లైంగిక వేదింపుల ఆరోపణలపై సమగ్రమైన, వేగవంతంగా విచారణ జరిపించాలని ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా కార్యదర్శి బి.పవన్‌ డిమాండ్‌ చేసారు. పత్రికలు, మీడియాలో వచ్చిన వార్తలపై యూనివర్శిటి రిజిష్టర్‌ ఎస్‌. టేకిని ఎస్‌.ఎఫ్‌.ఐ బృందం వివరణ కోరింది. రిజిష్టర్‌ బదులు ఇస్తూ ఉన్నత విద్యాశాఖ నుండి వచ్చిన లేఖ ఆధారంగా మహిళా ప్రొఫెసర్స్‌తో నిజ నిర్ధారణ కమిటి వేశామని, అక్టోబర్‌ 14 (సోమవారం) లోపు రిపోర్టు ఇవ్వాలని ఆదేశించామని తెలిపారు. ఎస్‌.ఎఫ్‌.ఐ జిల్లా కార్యదర్శి బి.పవన్‌ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేస్తూ యూనివర్శిటిలో ఇటువంటి ఆరోపణలు రావడం, అదికూడా నేరుగా రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ పంపడంలో యూనివర్శిటీ పాలక మండలి, బాధ్యులపై అనుమానాలు వస్తున్నాయని అన్నారు. ఇప్పుడైన విచారణ పారదర్శకంగా జరిపి విద్యార్ధినీలకు రక్షణ, భరోసా కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేసారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న సూర్య రాఘవేంద్రరావుకు ఇచ్చిన అదనపు సిడిసి అసిస్టెంట్‌ డీన్‌ హోదాను ఉపసంహరించాలని కోరారు. యూనివర్శిటి ప్రతిష్ట మంటగలిపే చర్యలు ఎవరు చేపట్టినా వారిపై కఠినంగా వ్యవహరించాలని అన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా విద్యార్ధినీల సమస్యలు చెప్పుకునేందుకు కంప్లైంట్‌ బాక్సులు పెట్టి వాటిలో వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని డిమాండ్‌ చేసారు. యూనివర్శిటీకి వెళ్ళిన ఎస్‌.ఎఫ్‌.ఐ. బృందంలో ఎస్‌.ఎఫ్‌.ఐ నగర అధ్యక్షులు వి.రాంబాబు, నాయకులు వీరబాబు తదితరులు ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here