యోగాతో ప్రశాంత జీవితం

0
324
నగరంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం
 రాజమహేంద్రవరం, జూన్‌ 21 : యోగ సాధనతో మానసిక ఒత్తిడి దూరమై,  ప్రశాంత జీవితం కలుగుతుందని నగర శాసనసభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్బముగా అయష్‌ వారి ఆధ్వర్యంలో స్ధానిక సుబ్రహ్మాణ్య మైదానంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నగర శాసన సభ్యులు డాక్టర్‌ ఆకుల సత్యనారాయణ, రూరల్‌ శాసన సభ్యులు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, సబ్‌ కలెక్టర్‌ సాయికాంత్‌ వర్మ, నగరపాలక సంస్ధ కమిషనర్‌ సుమిత్‌ కుమార్‌, పలువురు కార్పొరేటర్‌లు, వివిధ శాఖల అధికారులు పాల్గొని యోగసాధన చేసారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజమహేంద్రవరం నగర శాసన సభ్యులు డా.ఆకుల సత్యనారాయణ మాట్లాడుతూ భారతదేశ వారసత్వ సంపదలో యోగా అతి ముఖ్యమైందన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్రమోదీ చొరవతో జూన్‌ 21వ తేదిన ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగా దినోత్సముగా ప్రకటించిదని అయన అన్నారు. 175 దేశాలకు  పైగా ఈ అంతర్జాతీయ యోగా  దినోత్సమును జరుపుకుంటున్నాయని, అది మన దేశానికి ఎంతో గర్వకారణమని అన్నారు. యోగాను  దైనందిన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయని అన్నారు. యోగా మనస్సును, శరీరమును ఏకం చేస్తుందని, యోగా చేయడం వలన మానసిక,శారీరక ఒత్తిడిలను అధిగమించగలుగుతామని తద్వారా మన విధులను సక్రమంగా నిర్వహించుకోగలుగుతామన్నారు. ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్‌లో యోగా సాధన ద్వారా మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. మానసిక ఒత్తిడిని జయించడానికి  యోగా ఒక ఔషదంలా పనిచేస్తుందన్నారు.  ఈ కార్యక్రమంలో  ¬మియోపతి కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సూర్యభగవాన్‌, ప్రభుత్వ ఆసుపత్రి ఆయుష్షు డాకటర్‌ కె విజయకమారి, మున్సిపల్‌ డిప్యూటీ కమిషనర్‌ జగదీశ్వరరావు, మేనేజర్‌ కె శ్రీనివాసరావు, అర్బన్‌ తహశీల్దార్‌ టి రాజేశ్వరరావు, రూరల్‌ తహశీల్దార్‌ కె పోసియ్య, కార్పొరేటర్లు, అధికారులు,  వివిధ కళశాలల విద్యార్దిని,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here