యోగా గురువు తలాటం సూర్యప్రకాశ్‌కు సత్కారం

0
266
రాజమహేంద్రవరం, సెప్టెంబర్‌ 28 : యోగా గురువు తలాటం సూర్య ప్రకాశ్‌ను రాజమహేంద్రి (గోదావరి) లయన్స్‌ క్లబ్‌ సభ్యులు ఘనంగా సత్కరించారు. ధవళేశ్వరంలోని సామాజిక వేత్త ఉడుతా రంగారావు గృహంలో గత రాత్రి ఈ కార్యక్రమం నిర్వహించారు. లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ గోదావరి అధ్యక్షులు ఎం సూర్యనారాయణ మాట్లాడుతూ రంగారావు ధవళేశ్వరం వాసి కావడం  అదృష్టమన్నారు. పలు స్వచ్ఛంద సంస్ధలు, అభిమానులు ఆయనను సత్కరించారు.  ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా లయన్స్‌ క్లబ్‌ జోనల్‌  ఎస్‌వివి సత్యనారాయణ, బంగారు భాస్కర గుప్తా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వేమగిరి ఎంపిటిసి నాగేశ్వరరావు, రూరల్‌ టిడిపి నాయకులు  ధర్మరాజు, యోగా  మాష్టర్‌ ఎవి కోటేశ్వరరావు, సంఘ సేవకులు, ఆర్ధిక వేత్త పిచ్చికల బుజ్జి, సంఘ సేవకులు, మహిళాభ్యుదయ సభ్యులు పద్మజ, తులసి, వి.గౌతమ్‌ పాల్గొన్నారు.