రంజాన్‌ మంచికి చిహ్నం  

0
592
ఇన్నమూరి ఇఫ్తార్‌ విందులో ఆదిరెడ్డి
రాజమహేంద్రవరం, మే 22 : రంజాన్‌ మంచికి చిహ్నమని, ఆ పవిత్ర మాసంలో ముస్లింలు చాలా భక్తి శ్రద్ధలతో ఉంటారని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఆదిరెడ్డి శ్రీనివాస్‌(వాసు) పేర్కొన్నారు. మెయిన్‌రోడ్డులోని వన్‌టౌన్‌ పక్కన ఉన్న పెద్ద మసీదులో చందా సత్రం ఛైర్మన్‌ ఇన్నమూరి దీపు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఇఫ్తార్‌ విందు జరిగింది. కార్యక్రమానికి ఆదిరెడ్డి వాసు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. నమాజ్‌ అనంతరం ముస్లింలందరితో కలిసి ఆయన ఇఫ్తార్‌ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రంజాన్‌ మాసం ముస్లింలకు చాలా పవిత్రమైన రోజులని, ప్రతి ముస్లిం ఎంతో నిబద్దతతో రంజాన్‌ మాసంలో ఉపవాసం చేస్తారన్నారు. అందరితో సమానంగా బతకాలని, మనకున్న దానిలో పొరుగువారికి సహాయం చేయాలన్నదే రంజాన్‌ భావమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు షేక్‌ అసదుల్లా అహ్మద్‌, ట్రస్టీ, కార్యదర్శి ఎస్‌.ఏ.కరీమ్‌, ట్రస్టీలు ఎండి మూసా, సయ్యద్‌ ధన్షా, ఖుద్దూస్‌ భాషా, ఆరిఫుద్దీన్‌, సుభాన్‌ వల్లీ, ఇమామ్‌ ఎహెచ్‌ ఖాన్‌, కాకినాడ ఇమామ్‌ గౌసి, ఎండి ఎకె జిలానీ, ఎండి రెహ్మాన్‌ ఖాన్‌, ఆఫ్రిజ్‌, షేక్‌ అబ్దుల్లా, అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here