రసీదు పొందితే గాని జరిమానా చెల్లించకండి : అర్బన్‌ ఎస్పీ

0
155
రాజమహేంద్రవరం,నవంబర్‌ 8 : రాజమహేంద్రవరం పోలీసు అర్బన్‌ జిల్లాలో ఏ పొలీసు అధికారి అయినా ద్విచక్ర, ఇతర వాహనాలను తనిఖీ నిమిత్తం ఆపి వాహన రికార్డులను పరిశీలించినప్పుడు ఏదైనా రికార్డు లేదని జరిమానా విధిస్తే తగిన రసీదు పొందాలని అర్బన్‌ ఎస్పీ షిమోషీ బాజ్‌పాయ్‌ సూచించారు. ఏ పొలీసు అధికారి అయినా రసీదు ఇవ్వకుండా లంచం అడిగితే తన ఫోన్‌ నెంబర్‌  9440796502 కు ఫోన్‌ చేసి చెప్పాలన్నారు.  అలాగే  రాత్రి సమయంలో ఏ పొలీసు అధికారి అయిన డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులలో ఎవరిపైనైనా  కేసు నమోదు చేయకుండా లంచం అడిగితే వెంటనే తనకు మెసేజ్‌ ద్వారా లేదా వాట్సప్‌ ద్వారా గాని, ఫోన్‌ చేసి గాని తెలియపరచాలన్నారు.  అలా తెలియజేసిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. అలాగే  రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లాలో  ఎవరైనా పొలీసు స్టేషన్‌కు వచ్చి ఫిిర్యాదు ఇచ్చినప్పుడు పోలీసులు రసీదు ఇవ్వకుండా లంచం అడిగితే, అలాగే కేసులు నమోదు చేయడానికి,  దర్యాప్తునకు  కుడా లంచం అడిగితే తన ఫోన్‌ నెంబర్‌కు తెలియపరచాలన్నారు.  ముఖ్యమంత్రి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘స్పందన’ కార్యక్రమం అర్బన్‌ జిల్లాలో ఇంత వరకు వివిధ పొలీసు స్టేషన్లలలోను, డి.ఎస్‌.పి. ఆఫీస్‌లలో,  అర్బన్‌ ఎస్‌.పి. వద్దకు 653 ఫిర్యాదులను ప్రజలవద్ద నుండి స్వీకరించామన్నారు. వీటిలో 213 కేసులకుగాను ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, 393 తక్షణమే పరిష్కరించి ఫిర్యాదుదారులకు న్యాయం చేశామన్నారు. ఇంకా 47 మంది ఫిర్యాదుదారులకు న్యాయం చేయవలసి ఉందన్నారు. ప్రజలు ఈ కార్యక్రమాన్ని సద్యినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. అదే విధంగా అర్బన్‌ జిల్లాలో శాంతి భద్రతలను కాపాడేందుకు రౌడీలు,  బ్లేడ్‌ బ్యాచ్‌ వారిపై నిఘా పెంచి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అసాంఘిక కార్యకలాపాలు క్లబ్బుల్లో గాని లాడ్జిలలో గాని, రహస్య ప్రదేశాలలో ఏ ఇతర ప్రదేశాలలో ఎవరైనా జూదం, గుండాట, క్రికెట్‌ బెట్టింగ్‌, వ్యభిచారం ఆడినట్లుగా సమాచారం ఉంటే పై ఫోన్‌ నెంబర్‌కు తెలియపరచాలని ఎస్పీ కోరారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here