పుట్టినరోజు వేడుకల్లో గుడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, జూన్ 10 : తెలుగు చలన చిత్ర రంగంలో వైవిధ్య భరితమైన పాత్రలు పోషిస్తూ ఎన్టీఆర్ నట వారసుడిగా రాణిస్తున్న నందమూరి బాలకృష్ణ ఇకపై చలన చిత్రాల్లో నటిస్తూ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడుకి చేదోడుగా ఉంటూ చురుకైన పాత్ర పోషించాలని గుడా మాజీ చైర్మన్, నందమూరి వంశాభిమానుల సంఘం గౌరవాధ్యక్షులు గన్ని కృష్ణ కోరారు. హిందూపురం శాసనసభ్యులు, యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదిన వేడుకలు నందమూరి అభిమానుల సంఘం అధ్యక్షులు గొర్రెల రమణ ఆధ్వర్యంలో గన్ని కృష్ణ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. అభిమానుల సమక్షంలో గన్ని కృష్ణ పుట్టినరోజు కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సినీ చరిత్రలో తండ్రిలాగే జానపద,పౌరాణిక, సాంఘిక చిత్రాల్లో నటిస్తూ అందరి అభిమానం సంపాదించిన బాలకృష్ణ హిందూపురం శాసనసభ్యునిగా రెండోసారి గెలిచి ప్రజల అభిమానాన్ని పొందారని అన్నారు. ప్రస్తుత పరిస్థితులలో చంద్రబాబుకు బాలకృష్ణ సహకారిగా ఉంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ కాశి నవీన్ కుమార్,కార్పొరేటర్లు యిన్నమూరి రాంబాబు, తంగెళ్ళ బాబి, రత్నాకర్,చిట్టూరి ప్రవీణ్ చౌదరి, మొల్లి చిన్నియాదవ్, జాలా మదన్,తేతలి రాము,నల్లం ఆనంద్, పితాని కుటుంబ రావు,సంసాని ప్రసాద్, మెహబూబ్ ఖాన్, బిక్కిన రవికిషోర్,శేఖర్, దమర్ సింగ్ బ్రహ్మాజీ, పువ్వల జయరామ్,మొండి అనిత తదితరులు పాల్గొన్నారు.