రాజకీయాల్లో చక్రవర్తి ప్రత్యేక ముద్ర

0
155
వర్ధంతి సభలో గన్ని కృష్ణ
రాజమహేంద్రవరం, జనవరి 18 : నిత్యం ప్రజలతో సత్సంబంధాలు పెంచుకుని రాజకీయాలలో ఎం.ఎస్‌. చక్రవర్తి తనదైన ముద్ర వేసుకున్నారని గుడా చైర్మన్‌ గన్ని కృష్ణ అన్నారు.ఎం.ఎస్‌.చక్రవర్తి వర్ధంతి సందర్భంగా రాజమహేంద్రవరం దళిత సంఘాల అధ్వర్యంలో వర్ధంతి కార్యక్రమాన్ని గోకవరం బస్టాండ్‌ సెంటర్‌లోని అంబేద్కర్‌ విగ్రహం వద్ద నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గన్ని పాల్గొని చక్రవర్తి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా దళిత నాయకులు తాళ్ళూరి బాబు రాజేంద్రప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2002లో జరిగిన ఎన్నికల్లో హోరాహోరీగా జరిగిన పోటీలలో చక్రవర్తి విజయం సాధించి అందరితో కలిసిమెలిసి ఉండేవారని, ప్రథమ మేయర్‌గా మంచి గుర్తింపు పొందారని అన్నారు.ఆయన ఆకస్మిక మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని,తప్పనిసరిగా ఆయన విగ్రహం ఏర్పాటుకు అందరితో మాట్లాడతానని, నగరపాలక సంస్థలో తొలి మునిసిపల్‌ చైర్మన్‌ న్యాపతి సుబ్బారావు, తొలి మేయర్‌ చక్రవర్తి చిత్రపటాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కంబాలచెరువు పార్కులో బాలయోగి నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నామని, త్వరలోనే ఆవిష్కరిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ పాత్రికేయులు వి.ఎస్‌.ఎస్‌.కృష్ణకుమార్‌, డి.ఎ.లింకన్‌, పొలుగుమాటి కుమార్‌, కోరుకొండ చిరంజీవి, వైరాల అప్పారావు, తాళ్ళూరి విజయ్‌ కుమార్‌, తాడేపల్లి గణేశ్వరరావు,లద్దిక మల్లేష్‌,దొమ్మేటి సోమ శంకర్రావు, కట్టా సూర్యప్రకాశరావు, సమతం గన్నెయ్య, పాము బాబురావు, ఉప్పులూరి జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here