రాజమహేంద్రవరంలో గ్రీస్‌ బెల్ట్‌

0
184
ఉద్యాన వనాలు, సెంట్రల్‌ డివైడర్‌ల అభివృద్ధికి ముందస్తు చర్యలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 23 : రాజమహేంద్రవరం నగరంలో ఉన్న ఉద్యానవనాలు ,సెంట్రల్‌ డివైడర్‌లు, ముఖ్యమైన జంక్షన్లలో గ్రీనరీని అభివృద్ధి పరచేందుకు పక్కా ప్రణాళికను కమిషనరు సుమిత్‌ కుమార్‌ రూపొందించి దీనికి అనుగుణంగా నగరపాలక సంస్థ ఉద్యానవన శాఖను అప్రమత్తం చేశారు. ఉద్యానవనాలలలో గ్రీనరీని పెంచి, మొక్కలను నాటే క్రమంలో ప్రస్తుతం మొక్కల కొమ్మలను కత్తిరిస్తూ, మొక్కల పునరుద్దరణకు చర్యలను చేపట్టారు . మొక్కల సంరక్షణలో భాగంగా స్థూల సూక్ష్మ ధాతు పోషకాలను పిచ్‌ కారీ చేసే పనులపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. వీటితో పాటు ఉద్యానవనాలలో పెరిగిన కలుపు మొక్కలను దశలవారీగా తొలగిస్తూ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచే పనులపై సహాయ సంచాలకులు సిహెచ్‌.రమణారెడ్డి పర్యవేక్షణలో సిబ్బంది విధులను నిర్వర్తిస్తున్నారు. వీటితో పాటు నీటి లభ్యత ఉన్న ధవళేశ్వరం మంచి నీటి రిజర్వాయిర్‌ కోటిలింగాల రిజర్వాయిర్‌ ప్రాంతాలలో గ్రీనరీని పెంపొందించే మొక్కలను నాటి, వాటిని సంరక్షిస్తున్నట్లు రమణారెడ్డి తెలిపారు. రహదారి వెంబడి ఉన్న డివైడర్‌ లలో ఏర్పడిన ఖాళీ ప్రాంతాలలో మొక్కలను నాటి వాటిని సంరక్షించే విధానంలో వారంలో మూడు పర్యాయాలు నీటిని మొక్కలకు సరఫరా చేస్తున్నారు. అదేవిధంగా రాజమహేంద్రవరం నగరానికి పర్యాటకుల సందర్శన ఎక్కువగా ఉన్నందున లాలాచెరువు నుండి సెంట్రల్‌ జైలు మీదుగా ఉన్న రహదారి ,వై జంక్షన్‌ నుండి నందంగనిరాజు జంక్షన్‌, కంబాల చెరువు నుండి హై టెక్‌ బస్సు షెల్టర్‌, రామకృష్ణ మఠం నుండి శానిటోరియం, కోటిపల్లి జంక్షన్‌ నుండి డీలక్స్‌ సెంటర్‌ వరకు గల ప్రధాన రహదారుల వెంబడి ఉన్న సెంట్రల్‌ డివైడర్‌లలో మొక్కలను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు సూపరింటెండెంట్‌ ఇంజనీర్‌ ఓం ప్రకాష్‌ తెలిపారు . మంగళవారం స్థానిక ఆర్‌.వి.నగర్‌ నందు ఉన్న మహిళా పార్క్‌ను సందర్శించి పార్క్‌ల అభివృద్ధికి పలు సూచనలు చేసారు. జూన్‌ నెల ప్రారంభం నాటికి నగరంలో ఉన్న అన్ని పార్క్‌లు, సెంట్రల్‌ డివైడర్‌లను గ్రీనరీ పరంగా అభివృద్ధి పరచాలని కమిషనరు ఆదేశించి నందున వీటి అభివృద్ధిపై ప్రత్యేక ద ష్టి పెట్టాలని సహాయ సంచాలకులు రమణారెడ్డిని ఆదేశించారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here