రాజమహేంద్రవరంలో రేపు జోనల్‌ పాస్‌పోర్ట్‌ కార్యాలయం ప్రారంభం

0
291

రాజమహేంద్రవరం, మార్చి 9 : రాజమహేంద్రవరం జోనల్‌ పాస్‌పోర్టు కార్యాలయం రేపటి నుంచి సేవలందిస్తుందని పార్లమెంట్‌ సభ్యులు మాగంటి మురళీమోహన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రేపు మధ్యాహ్నం 2.30 గంటలకు నగరంలోని ప్రధాన తపాలా శాఖ కార్యాలయంలో ఈ కార్యాలయం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర విభజన జరగక ముందు పాస్‌పోర్టు కావలసిన వారు హైదరాబాద్‌ లేదా విశాఖ పట్టణం వెళ్ళవలసి వచ్చేదని, అయితే ఈ జోనల్‌ కార్యాలయం ప్రారంభమవుతున్నందున ఇకపై దూర ప్రాంతానికి వెళ్ళవలసిన అవసరం లేకుండా ఉభయ గోదావరి జిల్లాల వాసులు ఇక్కడే పాస్‌పోర్టు పొందవచ్చని ఎం.పి. తెలిపారు. విద్య, ఉద్యోగ, వ్యాపార పనులపై విదేశాలకు వెళ్ళే వారు పాస్‌పోర్టు ఇక్కడే పొందవచ్చన్నారు.

చర్చిపేట-మదన్‌సింగ్‌పేట కాలిబాట వంతెన ప్రారంభం రేపు

నగరంలోని చర్చిపేట-మదన్‌సింగ్‌పేటలను కలుపుతూ రైల్వే ట్రాక్‌పై నిర్మించిన కాలిబాట వంతెనను రేపు మధ్యాహ్నం 3-30 గంటలకు ఎం.పి. మురళీమోహన్‌ ప్రారంభించనున్నారు. గతంలో ఇక్కడ చెక్కల వంతెన ఉండేదని, అది పూర్తిగా దెబ్బతినడంతో కొద్దిరోజుల క్రితం రైల్వే అధికారులు తొలగించగా స్ధానికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. దీనిపై వారు ఆందోళనలు నిర్వహించగా స్పందించిన ఎంపి మురళీమోహన్‌ ఈ విషయాన్ని రైల్వే అధికారుల దృష్టికి తీసుకెళ్ళారు. రైల్వే అధికారులు స్పందించి చెక్కల వంతెన స్ధానే ఐరన్‌ వంతెనను నిర్మించారు. దీనికి రేపు ఎంపి మురళీమోహన్‌ ప్రారంభోత్సవం చేయనున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here